Reliance AGM 2023 Updates : ముఖేష్ అంబానీ కీలక ప్రకటన.. వచ్చే సెప్టెంబర్ 19నే జియో ఎయిర్‌ఫైబర్ లాంచ్.. ఇంకా ఏమన్నారంటే?

Reliance AGM 2023 Live Updates : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ఆగస్టు 28 మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమైంది, కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ అనేక కీలక అంశాలకు సంబంధించి ప్రసంగించారు.

Reliance AGM 2023 Updates : ప్రముఖ రిలయన్స ఇండస్ట్రీస్ (RIL) 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (Reliance AGM 2023 Event) ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిల్ అధినేత ముకేష్ అంబానీ (Mukesh Ambani) కీలక ప్రకటనలు చేశారు. పలు అంశాలపై అంబానీ ప్రసంగించారు. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రయాన్ 3 విజయవంతం కావడంపై అంబానీ మాట్లాడారు. గత 10ఏళ్లలో రిల్ కంపెనీ 150 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టిందని ఆయన అన్నారు. ఈ స్థాయిలో మరో కార్పొరేట్ కంపెనీ కూడా చేయలేదని, అందుకే.. ఇండియా అన్‌స్టాపబుల్ అంబానీ పేర్కొన్నారు.

Read Also : Jio 5G, JioPhone 5G : జియో 5G సేవలతో పాటు జియో ఫోన్ 5G వస్తోంది.. ఆగస్టు 29 లాంచ్ అయ్యే ఛాన్స్..!

వినాయక చవితి నాడే జియో ఎయిర్ ఫైబర్ :
ఈ క్రమంలోనే దేశంలో జియో ఎయిర్‌ఫైబర్‌ను సెప్టెంబర్ 19న లాంచ్ చేయనున్నట్టు ముఖేష్ అంబానీ వెల్లడించారు. జియో ఎయిర్‌ఫైబర్ (Jio AirFiber) లాంచ్‌పై ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు. ‘ఆప్టికల్ ఫైబర్ సాయంతో ప్రస్తుతం నిత్యం దాదాపు 15వేల ప్రాంగణాలను కనెక్ట్ చేయగల సామర్థం ఉంది. జియో ఎయిర్‌ఫైబర్‌ ద్వారా రోజుకు లక్ష 50వేల కనెక్షన్‌లతో ఈ విస్తరణను సూపర్‌ఛార్జింగ్ చేయొచ్చునని అంబానీ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి సందర్భంగా జియో ఎయిర్‌ఫైబర్ లాంచ్ అవుతుందని తెలిపారు. కస్టమర్ వాల్యూతో పాటు ఆదాయ వృద్ధికి మరో మార్గాన్ని ఇస్తుందని ప్రకటించడానికి చాలా ఆనందంగా ఉందని అంబానీ అనేక విషయాలను ప్రస్తావించారు.

Reliance AGM 2023 Live Updates _ Jio AirFiber to launch on September 19, says Mukesh Ambani

బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా ఆ ముగ్గురికే అవకాశం : 
రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) కంపెనీ ఆల్‌రౌండర్ పర్ఫార్మెన్స్ కనబర్చిందని అన్నారు. రిలయన్స్ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. 9,74,864 కోట్లుగా నమోదు అయిందని రిల్ అధినేత తెలిపారు. రిలయన్స్ ఈబీటా సైతం 1,53,920 కోట్లుగా నమోదైందని పేర్కొన్నారు. నికర లాభం రూ. 73,670 కోట్లుగా ఉందన్నారు. అన్ని వ్యాపారాల్లోనూ 2.6 లక్షల ఉద్యోగాలను సృష్టించిందని చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, అనంత అంబానీలను బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా తీసుకోవడంపై సిఫార్సు చేయడం జరిగిందని అంబానీ తెలిపారు.

నీతా అంబానీ బోర్డు నుంచి దిగిపోనున్నారని, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా ఆమె కొనసాగుతారని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత.. 5G సెల్స్‌లో దాదాపు 85 శాతం జియో నెట్‌వర్క్‌ ఉందని గుర్తు చేశారు. ప్రతి 10 సెకన్లకు ఒకసారి ఒక 5G సెల్ ఏర్పడుతుందని అన్నారు. 2023 డిసెంబర్‌లోగా దేశ వ్యాప్తంగా జియో 5G సేవలు అందుబాటులోకి వస్తాయని అంబానీ వెల్లడించారు.

Read Also : Reliance AGM 2023 Event : రిలయన్స్ AGM 2023 ఈవెంట్.. ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలపై ఆసక్తి.. లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే?

ట్రెండింగ్ వార్తలు