ఆధారాలతో సహా ఇస్తా.. సోమిరెడ్డి అక్రమాలపై విచారణ చేపట్టగలరా? : కాకాణి గోవర్ధన్ రెడ్డి

సోమిరెడ్డి మంత్రిగాఉన్న సమయంలో నియోజకవర్గంలో ఇష్ట ప్రకారంగా అక్రమ లేఔట్స్ వేశారు.. 2019లో మేము అధికారంలోకిరాగానే వీటిపై జిల్లా కలెక్టర్ విచారణ చేశారు.

Former Minister Kakani Govardhan Reddy

Former Minister Kakani Govardhan Reddy : రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నాపై తప్పుడు రాతలు రాయిస్తున్నారు. నాకు తెలిసి సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ లేఔట్లు వేసిన పరిస్థితి మా హయాంలో ఎక్కడా లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోమిరెడ్డి మంత్రిగాఉన్న సమయంలో నియోజకవర్గంలో ఇష్ట ప్రకారంగా అక్రమ లేఔట్స్ వేశారు.. 2019లో మేము అధికారంలోకిరాగానే వీటిపై జిల్లా కలెక్టర్ విచారణ చేశారు. పొదలకూరు పరిధిలో 40 అక్రమ లేఔట్లు వేశారని అప్పట్లో తేల్చారు. 2016లో టీడీపీ హయాంలో విజిలెన్స్ విచారణ జరిపితే 25 లేఔట్లకి ఆరు కోట్లకిపైగా ప్రభుత్వానికి నష్టం వచ్చిందని తేల్చారు. ఆరు కోట్ల రూపాయలు ఫైన్ వేస్తే.. రెండు కోట్లు సోమిరెడ్డి కమిషన్లు తీసుకుని విజిలెన్స్ నివేధికని తొక్కి పెట్టాడని కాకాణి ఆరోపించారు.

Also Read : బీఆర్ఎస్‌ పార్టీకి మరో బిగ్‌షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే

సోమిరెడ్డి ఇంటి చుట్టూ ఉన్న లేఔట్లలో కమిషన్లు తీసుకున్నాడు. మీ పాపానికి, అధికార దాహానికి పంచాయతీ కార్యదర్శులపై చర్యలకు నివేదిక ఇచ్చారు. మేము అప్పట్లో అధికారులకి అండగా నిలిచామని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల్లో సోమిరెడ్డి చేస్తున్న అక్రమాలు అనేకం ఉన్నాయి. లేఔట్ల యాజమాన్యాలని భయపెట్టి కమిషన్లు తీసుకున్నాడు. ధర్మల్ ప్రాజెక్టు నుంచి సోమిరెడ్డి, ఆయన కొడుకు నెలనెలా మామూళ్లు తీసుకుంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే అల్లిపురంలో లేఔట్లపై విచారణ చేపించగలవా..? సోమిరెడ్డి అక్రమాలపై చంద్రబాబు నిఘా పెట్టి విచారణ చేపించగలడా? అంటూ కాకాణి ప్రశ్నించారు.

Also Read : బల్దియాలో రచ్చరచ్చ.. మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ సభ్యులు పట్టు.. పోడియం చుట్టుముట్టి..

ఆధారాలతో సహా అన్నీ నేను ఇస్తా.. సోమిరెడ్డి అక్రమాలపై చంద్రబాబు విచారణ చేపట్టగలరా?. సిట్ వేస్తానని సోమిరెడ్డి చెబుతున్నాడట.. నీకు ఇష్టమైన విభాగం నుంచి విచారణ చేపించుకోవచ్చునని కాకాణి అన్నారు. ధర్మల్ ప్రాజెక్టు నుంచి ఫ్లయాష్ ఇతర రాష్ట్రాలకు సోమిరెడ్డి అమ్ముకుంటున్నాడంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించాడు.