బల్దియాలో రచ్చరచ్చ.. మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ సభ్యులు పట్టు.. పోడియం చుట్టుముట్టి..
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సమావేశం ప్రారంభంకాగానే ..

GHMC General Body Meeting
GHMC General Body Meeting : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సమావేశం ప్రారంభంకాగానే ఆందోళనలతో హోరెత్తించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మీ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. మేయర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల విజయలక్ష్మీ మేయర్ పదవికి రాజీనామా చేయాలంటూ ప్రధానంగా డిమాండ్ చేశారు. మరోవైపు ప్రజా సమస్యలపై బీజేపీ సభ్యులుసైతం ఆందోళనకు దిగారు. ఇరు పార్టీల సభ్యుల ఆందోళనలతో సభలో గందరగోళం ఏర్పడింది. మరోవైపు బీజేపీ, ఎంఐఎం సభ్యులు బాహాబహీకి దిగారు. దీంతో కౌన్సిల్ సమావేశంను మేయర్ కొద్దిసేపు వాయిదా వేశారు.
Also Read : బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్‌షాక్.. కాంగ్రెస్‌లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే
మేయర్ పదవికి విజయలక్ష్మీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని పోడియంను చుట్టుముట్టారు. దీంతో సమావేశంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యుల దగ్గర సబ్జెక్టు లేదు.. అందుకే ఆందోళన చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ముందు పార్టీ పిరాయింపులను ప్రోత్సహించింది ఎవరు..? మీకు మాట్లాడటానికి సిగ్గుండాలి అంటూ మేయర్ ఫైర్ అయ్యారు.
Also Read : Hathras stampede : తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా.. హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే?