ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభం.. దుర్గమ్మకు తొలిసారెను సమర్పించిన వైదిక కమిటీ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో కొలువైఉన్న కనకదుర్గమ్మ వారి ఆషాడ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

Ashadamasotsavam on Indrakiladri

Ashadamasotsavam on Indrakiladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో కొలువైఉన్న కనకదుర్గమ్మ వారి ఆషాడ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతీయేటా అమ్మవారికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ఈసారికూడా భక్తులు సారే సమర్పణకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి తొలిసారె ఆలయ వేదిక కమిటీ, ప్రధాన అర్చకులు సమర్పించారు. దీనికితోడు ఇవాళ్టి నుంచి 16వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై మొదటిసారి వారాహి నవరాత్రులు జరగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గగుడి ఈవో రామారావు మాట్లాడుతూ.. నెల రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై ఆషాఢ‌ మాస సారె మహోత్సవం జరుగుతుందని, భక్తులు అమ్మవారికి సారె సమర్పించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

Also Read : ఆధారాలతో సహా ఇస్తా.. సోమిరెడ్డి అక్రమాలపై విచారణ చేపట్టగలరా? : కాకాణి గోవర్ధన్ రెడ్డి

వచ్చేనెల 19వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై శాకాంబరి దేవి ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో రామారావు చెప్పారు. ఇంద్రకీలాద్రి పై మొట్టమొదటిసారిగా వారాహి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవాలు జులై 6 నుంచి 15వరకు జరుగుతాయి. వారాహి ఉపాసన, హోమం, హవనం, చండీ పారాయణ, రుద్రహోమం వారాహి నవరాత్రులలో జరుపుతాం. 14న తెలంగాణా మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారని ఈవో తెలిపారు.

Also Read : బీఆర్ఎస్‌ పార్టీకి మరో బిగ్‌షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది. మధ్యాహ్నం మహానివేదన సమయంలో సామాన్య భక్తులు అధిక సంఖ్యలో వేచి ఉంటున్నారు. ఆ సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు ఆపాలని నిర్ణయించామని ఆలయ ఈవో తెలిపారు. ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:15 వరకూ మహా నివేదన ఉంటుంది. 11:30 నుంచి 1:30 వరకూ ప్రోటోకాల్ దర్శనాలు ఉండవు. సామాన్య భక్తులకు దర్శనంలో ఆటంకం కలగకూడదనే ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేశామని ఈవో చెప్పారు.