సినిమాలు చేయడంపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

కాకినాడ జిల్లా ఉప్పాడ సెంటర్ లో జరిగిన వారాహి సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా.. ఫ్యాన్స్.. OG, OG అని అరిచారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు.

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు పొలిటికల్ స్టార్ గా మారారు. ఆయనిప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పలు కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. తనకు కేటాయించిన శాఖలపై వరుసగా రివ్యూలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు పవన్ కల్యాణ్. ప్రజలకు సేవ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ ఇక ముందు సినిమాలు చేస్తారా? లేదా? అన్నది అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. తమ అభిమాన నాయకుడిని ఇక ముందు సిల్వర్ స్క్రీన్ పై చూడలేమా? అని వారు వర్రీ అవుతున్నారు.

OG చూద్దురు గానీ.. బాగుంటుంది
కాకినాడ జిల్లా ఉప్పాడ సెంటర్ లో జరిగిన వారాహి సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా.. ఫ్యాన్స్.. OG, OG అని అరిచారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. ”సినిమాలు చేసే టైమ్ ఉందంటారా? నిన్ను ఎన్నుకుంటే రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని ప్రజలు మనల్ని తిట్టకూడదు కదా? మనం OG అంటే వాళ్లు క్యాజీ అంటారు. నిర్మాతలు నన్ను క్షమించాలి. ముందు 3 నెలలు ఆంధ్ర ప్రజలకు కనీసం సేవ చేసుకుంటా. కుదిరినప్పుడల్లా రెండు, మూడు రోజులు సినిమా షూటింగ్ చేస్తాను, ఎక్కడా పనికి అంతరాయం రాకుండా అని నిర్మాతలకు చెప్పాను. OG చూద్దురు గానీ, బాగుంటుంది” అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.

పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలంతో…
వారాహి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల డబ్బుకు జవాబుదారిగా ఉంటానని, లంచాలు తీసుకోనని తెలిపారు. అసెంబ్లీలో ఎలా అడుగు పెడతారో చూస్తాం, నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవని కొందరు అన్నారని గుర్తు చేసిన పవన్.. అసెంబ్లీ గేట్లు నెట్టుకుని రావడం కాదు బద్దలు కొట్టుకుని వస్తాడు పవన్ కల్యాణ్ అని వర్మ చెప్పిన వ్యాఖ్యలు నిజమయ్యాయని వ్యాఖ్యానించారు.

బాపూజీ కన్న కలల సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నానని పవన్ చెప్పారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలంతో కేంద్రం దగ్గర ఏం కావాలన్నా చేయించుకునే ధైర్యం వచ్చిందన్నారు. తాను పదవిలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా రాజాలాగే ఉన్నానని వెల్లడించారు. కూటమి కట్టకముందు సీఎం అవుతానని మీకోసం చెప్పానని, కానీ అమ్మవారు తనను ఈసారి డిప్యూటీ సీఎం అవ్వాలని ఆదేశించిందన్నారు.

Also Read : కూటమి ప్రభుత్వం టార్గెట్ నెంబర్ 1 ఆయనేనట..! సీఎం, డిప్యూటీ సీఎం, మాజీ సీఎం ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి

పిఠాపురం సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను
తాను పిఠాపురానికి నాన్ లోకల్ అంటూ వైసీపీ నేతలు విమర్శించారని గుర్తు చేసిన పవన్.. ఈరోజున తాను పిఠాపురం సంపూర్ణ వాస్తవ్యుడిగా మారానని తెలిపారు. పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నానని, ఇక్కడే ఆఫీస్, ఇల్లు కట్టుకుంటానని పవన్ వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు