Future Reliance Deal: ఫ్యూచర్ సంస్థ డీల్ ను తెగతెంపులు చేసుకున్న రిలయన్స్: డీల్ కు వ్యతిరేకంగా ఓటు వేసిన రుణ దాతలు

శుక్రవారం వెల్లడించిన స్టేక్ హోల్డర్ల ఓటింగ్ ఫలితాల ప్రకారం..99.97 శాతం మంది సెక్యూర్డ్ క్రెడిటర్స్..ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారు.

Future Reliance Deal: దేశం వ్యాపార వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించిన ఫ్యూచర్ రిటైల్ – రిలయన్స్ డీల్ వ్యవహారానికి తెరపడింది. ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు నుంచి తప్పనుకుంటున్నట్లు రిలయన్స్ సంస్థ ప్రకటించడం పరిశ్రమ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఫ్యూచర్ గ్రూపును కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ రూ.24,713 కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది. 21 నెలల క్రితం రెండు సంస్థల మధ్య జరిగిన ఈ ఒప్పందానికి ఇంతటితో స్వస్తి పలుకుతున్నట్లు రిలయన్స్ సంస్థ వెల్లడించింది. అమెజాన్ సంస్థను కాదని కోర్టుల వరకు వెళ్లిన ఫ్యూచర్ సంస్థకు రిలయన్స్ సంస్థ గట్టి షాక్ ఇచ్చింది. కిషోర్ బియానికి చెందిన ఫ్యూచర్ గ్రూపులోని ఫ్యూచర్‌ రిటైల్, లాజిస్టిక్స్, గోడౌన్లు.. సహా ఇతర లిస్టెడ్‌ కంపెనీలకు చెందిన రుణదాతలు ఈ డీల్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఈ డీల్ ను ఇకపై కొనసాగించలేమని రిలయన్స్ సంస్థ వెల్లడించింది.

Also read:Corona in India: దేశంలో 15 వేలు దాటిన యాక్టివ్ కేసులు: వరుసగా ఐదో రోజు రెండు వేలకు పైగా కేసులు

ఫ్యూచర్ రిటైల్, రిలయన్స్ మధ్య గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం..ఫ్యూచర్ గ్రూపులోని రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, గిడ్డంగుల వ్యాపారాల్లోని 19 కంపెనీలను ఒకే సంస్థ కిందకు తీసుకువచ్చి రిలయన్స్ సంస్థకు అప్పగించాల్సి ఉంది. అయితే శుక్రవారం వెల్లడించిన స్టేక్ హోల్డర్ల ఓటింగ్ ఫలితాల ప్రకారం..99.97 శాతం మంది సెక్యూర్డ్ క్రెడిటర్స్..ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారు. అదే సమయంలో 99.99 శాతం మంది వాటాదారులు, 62.65 శాతం మంది ఆన్ సెక్యూర్డ్ క్రెడిటర్స్..ఈ ఓటింగ్ లో డీల్ కు అనుకూలంగా ఓటు చేశారు. కానీ లాజిస్టిక్స్ విభాగం మినహా 19 విభాగాల్లో ఈ ఒక్క విభాగం కూడా విలీనానికి అవసరమైన 75 శాతం ఓటింగ్ ను సాధించలేకపోయాయి.

Also read:Cooking Oil Price Hike: సామాన్యుడిపై మరో బాంబ్.. మళ్ళీ పెరగనున్న వంట నూనె ధరలు!

ఈ వోటింగ్ ఫలితాలను విశ్లేషించిన రిలయన్స్ ప్రతినిధుల బృందం..డీల్ ను రద్దు చేసుకోవడం మేలని సూచించారు. దీంతో ఇంతటితో ఫ్యూచర్ రిటైల్ డీల్ పై వెనక్కు తగ్గుతున్నట్లు రిలయన్స్ వెల్లడించింది. ఒప్పందం వెనక్కు వెళ్లిపోవడం ఫ్యూచర్ గ్రూపుకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. రిలయన్స్ ఫ్యూచర్ డీల్ పై ఆది నుంచి అడ్డంకులు ఎదురౌతూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెజాన్ సంస్థ నుంచి ఫ్యూచర్ గ్రూప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2019లో ఫ్యూచర్ గ్రూపులో ఒక విభాగమైన ఫ్యూచర్ కూపన్స్ ను అమెజాన్ సంస్థ కొనుగోలు చేసింది. అదే సమయంలో ఫ్యూచర్ రిటైల్ ను కొనుగోలు చేస్తున్నట్లు రిలయన్స్ ప్రకటించింది.

Also read:PM Modi in JandK: ఆర్టికల్ 370 రద్దు అనంతరం మొదటిసారి జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని మోదీ పర్యటన

అయితే అంతక్రితమే ఫ్యూచర్ గ్రూపుతో కుదుర్చుకున్న తమ ఒప్పందాన్ని రిలయన్స్ ఉల్లంఘిస్తుందంటూ అమెజాన్ సంస్థ కోర్టుకు ఎక్కింది. ఈ విషయంపై ఫ్యూచర్ సంస్థను, ప్రోమోటర్లపై సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ లో పంచాయితీ కూడా పెట్టింది అమెజాన్. దీంతో ఫ్యూచర్ సంస్థతో అమెజాన్ వ్యవహారం తేలేవరకు రిలయన్స్ – ఫ్యూచర్ ఒప్పందంపై స్టే విధించింది. 2020 అక్టోబర్లో అమెజాన్ కు అనుకూలంగా తీర్పు వెలువడింది. అనంతరం ఢిల్లీ హై కోర్టులోనూ, సుప్రీం కోర్టులోనూ..చివరకు ఎన్సీఎల్టిలలోనూ ఈ వివాదంపై కేసులు విచారణలు కొనసాగుతూనే వచ్చాయి.

Also read:Tirupati : తిరుపతి చేరుకున్న 100 టన్నుల సేంద్రియ శనగలు

ట్రెండింగ్ వార్తలు