Twitter Blue: ఇండియాలోనూ బ్లూటిక్ వెరిఫికేషన్ ప్రారంభించనున్న ట్విట్టర్.. నెలవారి రుసుము ఎంతంటే?

ఒక బ్లాగ్ పోస్ట్‌లో, ట్విట్టర్ బ్లూ టిక్ భారతదేశంలోనే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, బ్రిటన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, ఇండోనేషియా, బ్రెజిల్‌ దేశాలలో అందుబాటులో ఉందని ట్విట్టర్ పేర్కొంది. భారతదేశంలోని ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు ఈ సభ్యత్వాన్ని కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ట్విట్టర్ వెబ్ వెర్షన్ ద్వారా ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను పొందేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది.

Twitter Blue: ప్రీమియం సబ్‭స్ర్కిప్షన్ కింద అమెరికా సహా ఎంపిక చేసిన పలు దేశాల్లో నెల వారి రుసుముతో బ్లూటిక్ వెరిఫికేషన్ ఇస్తున్న ట్విట్టర్.. తొందరలోనే ఇండియాలో కూడా ప్రారంభించేందుకు అన్నీ సిద్ధం చేసుకుంది. ఇండియాలో నెల వారి రుసుమును 900 రూపాయలుగా ఉండొచ్చని తెలుస్తోంది. అంటే ఈ మొత్తం చెల్లిస్తే నెల రోజుల పాటు ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ వెరిఫికేషన్ వర్తిస్తుంది. ఇంతకు ముందు ఈ బ్లూ టిక్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. ట్విట్టర్ నియమాల ప్రకారం.. ఎంపిక చేసిన అభ్యర్థులకు మాత్రమే దీనిని జారీ చేసేవారు.

Turkiye Syria Earthquake: టర్కీ, సిరియాలో 15వేలు దాటిన మృతుల సంఖ్య.. శిథిలాల కింద కొనసాగుతున్న అన్వేషణ

ఒక బ్లాగ్ పోస్ట్‌లో, ట్విట్టర్ బ్లూ టిక్ భారతదేశంలోనే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, బ్రిటన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, ఇండోనేషియా, బ్రెజిల్‌ దేశాలలో అందుబాటులో ఉందని ట్విట్టర్ పేర్కొంది. భారతదేశంలోని ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు ఈ సభ్యత్వాన్ని కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ట్విట్టర్ వెబ్ వెర్షన్ ద్వారా ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను పొందేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది.

Russian Oil: తోక ముడిచిన అమెరికా.. రష్యా నుంచి ఇండియా చమురు కొనడంపై అభ్యంతరం లేదట

వెబ్ ద్వారా బ్లూ మెంబర్‌షిప్ ధర నెలకు 650 రూపాయలు ఉంటుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. వినియోగదారులు వార్షిక ప్లాన్‌ను కనుక పొందినట్లయితే బ్లూ టిక్ సభ్యత్వం సంవత్సరానికి 6,800 రూపాయలు చెల్లించాలి. ఇలా చూసుకుంటే నెలకు 566.67 రూపాయల చొప్పున సభ్యత్వం లభిస్తుంది. ట్విట్టర్ బ్లూతో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రొఫైల్‌లో బ్లూ బ్యాడ్జ్ పబ్లిక్ ప్రొఫైల్ గుర్తింపును ఇస్తుంది. దీనితో పాటు తక్కువ ప్రకటనలు, ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు, రాబోయే ఫీచర్‌లకు ముందస్తుగా యాక్సెస్‌ని పొందవచ్చు. స్పాం వంటి వాటి నుంచి రక్షణను ఇస్తుంది.

ట్రెండింగ్ వార్తలు