Uttar Pradesh: యూపీలో దారుణం..10ఏళ్ల బాలుడ్ని నరబలి ఇచ్చిన బంధువు.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు..

యూపీలో దారుణం చోటు చేసుకుంది. తన రెండేళ్ల కుమారుడ్ని అనారోగ్యం నుంచి కాపాడుకొనేందుకు తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. తాంత్రికుడు చెప్పాడని, తన కుమారుడి ఆరోగ్యం నయం అవుతుందని భావించి తన బంధువు పదేళ్ల కుమారుడ్ని నరబలిచ్చాడు ఓ వ్యక్తి. బాలుడు కనిపించకపోవటంతో పోలీసులు రంగంలోకిదిగి విచారణ చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Uttar Pradesh: యూపీలో దారుణం చోటు చేసుకుంది. తాంత్రికుడు చెప్పాడని తన కుమారుడ్ని కాపాడుకునేందుకు.. తన బంధువుల కుమాడిని నరబలి ఇచ్చి దారుణానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. కొడుకు కనిపించక పోవటంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. యూపీలోని బహ్రైచ్ జిల్లా పర్సా గ్రామానికి చెందిన కృష్ణ వర్మకు పదేళ్ల కుమారుడు ఉన్నాడు. అతడి పేరు వివేక్ వర్మ. అదే గ్రామంలో కృష్ణ వర్మకు అనూప్ అనే బంధువు ఉన్నాడు. అతడికి రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు.

Crime News: ధాబాలోని ఫ్రీజర్ లో యువతి మృతదేహం లభ్యం.. ఆమెను ప్రేమించిన వ్యక్తి అరెస్ట్

అనూప్ కుమారుడికి ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండేది కాదు. పలువురి వైద్యులు, మంత్రగాళ్ల వద్దకు తిప్పినా ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో ఓ తాంత్రికుడి వద్దకు వెళ్లి తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిని అనూప్ వివరించాడు. నరబలి చేస్తే అంతా బాగుంటుందని తాంత్రికుడు చెప్పాడు. ఇందుకోసం పదేళ్లు, అంతకన్న తక్కువ వయస్సు బాలుడిని నరబలి ఇవ్వాలని అనూప్ కు సూచించాడు. అనూప్ తన కుమారుడిపై ఉన్న అమితమైన ప్రేమతో తన బంధువు కృష్ణ వర్మ కుమారుడు వివేక్ వర్మను బలిచ్చేందుకు నిర్ణయించుకున్నాడు.

Cyber crime : లాటరీలో కారు గెలిచారంటూ మెసేజ్..మహిళ ఎకౌంట్ నుంచి రూ.14 లక్షలు మాయం

వివేక్ వర్మను రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి నరబలి ఇచ్చాడు. కుమారుడు కనిపించక పోవటంతో కృష్ణ వర్మ వెతుకులాట ప్రారంభించాడు. అయినా ఆచూకీ లభించక పోవటంతో మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా.. అనూప్ పై అనుమానం వచ్చింది. అనూప్ ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అనూప్, అతనికి సహకరించిన చింతారామ్‌తో పాటు తాంత్రికుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ట్రెండింగ్ వార్తలు