kidnap: డబ్బుకోసం బాలుడి కిడ్నాప్.. అనంతరం హత్య.. ఇదంతా చేసింది బంధువులే.

kidnap: డబ్బు మనిషిని మృగంలా మార్చుతుంది. బంధాలను పలచన చేసి చేసి ప్రాణాలు తీసేలా చేస్తుంది. డబ్బు కోసం అన్న కొడుకుని కిడ్నాప్ చేసి హత్యచేశాడో దుర్మార్గుడు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో చోటుచేసుకుంది. 11 ఏండ్ల అభిషేక్ ను బాబాయ్ వరసయ్యే మనోజ్ కుమార్ కొడుకు కునాల్ వీడియో గేమ్ ఆడదామంటూ బయటకు తీసుకెళ్లాడు. రషీద్ అలీ అనే వ్యక్తితో కలిసి ఉన్న మనోజ్ కు అభిషేక్ ను అప్పచెప్పాడు కునాల్. ఆ తర్వాత రషీద్, మనోజ్ కలిసి అభిషేక్ ను ఇంట్లోకి తీసుకెళ్లారు. కిడ్నాప్ చేసి అభిషేక్ తండ్రిని నుంచి పది లక్షలు డిమాండ్ చెయ్యాలని ప్లాన్ వేశారు. అయితే ఈ విషయాన్ని అభిషేక్ పసిగట్టాడు.

తాను కిడ్నాప్ అయ్యాననే విషయం గ్రహించి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలోనే కేకలు వేశాడు… చుట్టుపక్కలవారు అభిషేక్ కేకలు విన్నారు.. కానీ ఇదేదో ఇంట్లో గొడవ అని పట్టించుకోలేదు. అభిషేక్ గట్టిగా అరుస్తుండటంతో తమగురించి ఎక్కడ తెలిపిపోతుందో అని భయంతో కునాల్ అభిషేక్ గొంతునొక్కి చంపేశాడు. మృతి చెందాడని నిర్దారించుకున్న తర్వాత సెక్టార్ 62 వద్ద ఓ మురికి కాలువలో మృతదేహం పడేశారు. బయటకు వెళ్లిన కుమారుడు ఇంటికి రాకపోవడంతో అభిషేక్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సమీపంలోని సీసీటీవీలను పరిశీలించి కునాల్, అభిషేక్ ను తీసుకెళ్లినట్లు గుర్తించారు.

కునాల్ ను అదుపులోకి తీసుకోని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. తన తండ్రి మరో వ్యక్తి డబ్బుకోసం అభిషేక్ ను కిడ్నాప్ చేశారని.. అభిషేక్ విషయం తెలుసుకొని గట్టిగా అరవడంతో భయంతో హత్యచేశానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. మృతదేహం పడేసిన ప్రదేశం తెలిపాడు. దీంతో పోలీసులు మురికి కాలువలో గాలించి మృతదేహం బయటకు తీసి పోస్టుమార్టం నిమ్మితం నోయిడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని మనోజ్, కునాల్. రషీద్ లను స్టేషన్ కు తరలించారు. డబ్బు కోసం బంధువులు ఈ దారుణానికి పాల్పడటం స్థానికులను ఆగ్రహానికి గురిచేస్తుంది. ఇక అభిషేక్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు