Woman Killed Husband And Aunt : ప్రియుడితో కలిసి భర్త, అత్తను హత్య చేసిన వివాహిత.. మృతదేహాలను ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచిన మహిళ

అస్సాంలో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టారు. ప్రియుడితో కలిసి తన భర్త, అత్తను హత్య చేశారు. అంతే కాకుండా మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచారు. కొన్ని రోజులు ఫ్రిజ్ లో దాచిన తర్వాత వాటిని పాలిథిన్ కవర్ లో ఉంచి మారుమూల ప్రాంతంలో పడేశారు.

Woman Killed Husband And Aunt : అస్సాంలో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టారు. ప్రియుడితో కలిసి తన భర్త, అత్తను హత్య చేశారు. అంతే కాకుండా మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచారు. కొన్ని రోజులు ఫ్రిజ్ లో దాచిన తర్వాత వాటిని పాలిథిన్ కవర్ లో ఉంచి మారుమూల ప్రాంతంలో పడేశారు. ఆపై తన భర్త, అత్త కనిపించడం లేదంటూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. ఈ ఘటన గౌహతిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూన్ మతి ప్రాంతానికి చెందిన బందన కలితకు ధంజిత్ దేకా
అనే వ్యక్తితో సదరు వివాహిత వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నారు. ఈ నేపథ్యంలో ఏడు నెలల క్రితం ప్రియుడు, మరో స్నేహితుడు అరూప్ దాస్ తో కలిసి భర్త అమరేంద్ర దే, అత్త శంకరి దేవిని హత్య చేశారు. ఆ తర్వాత ఆ ముగ్గురూ కలిసి మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికారు. వాటిని మూడు రోజులపాటు ఫ్రిజ్ లో ఉంచారు. అనంతరం మృతదేహాల ముక్కలను పాలిథిన్ కవర్ లో ఉంచి పొరుగున ఉన్న మేఘాలయలోని అటవీ ప్రాంతంలో పడేశారు.

Wife Killed Husband : వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం.. భర్తకు విషం కలిపిన అన్నం ఇచ్చి చంపిన భార్య

కలిత మరుసటి రోజు తన భర్త, అత్త కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే వారికి ఎలాంటి సమాచారం లభించలేదు. కొన్ని నెలల తర్వాత అమరేంద్ర సోదరుడు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోదరుడు, తల్లి అదృశ్యం వెనుకాల కలిత ప్రమేయం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు మళ్లీ ఆ దిశగా దర్యాప్తు చేశారు.

కొన్ని ఆధారాలు లభించడంతో శుక్రవారం పోలీసులు కలితను అదుపులోకి తీసుకున్నారు. భర్త, అత్త అదృశ్యంపై ఆమెను ప్రశ్నించారు. భర్త, అత్తను హత్య చేసినట్లు విచారణలో పేర్కొన్నారు. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆదివారం మేఘాలయ ప్రాంతంలో వెతకగా కొన్ని శరీర భాగాల ముక్కలు పోలీసులకు లభించాయి. ఈ క్రమంలో కలిత, ఆమె ప్రియుడితోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురు నిందితులను విచారిస్తున్నట్లు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు