ED Cese On Prajapati : ఉద్యోగాల పేరుతో రూ.720 కోట్లు దోపిడీ .. గుజరాత్‌కు చెందిన ప్రజాపతిపై ఈడీ కేసు

ప్రజాపతిపై తెలంగాణలోని హైద్రాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వందల కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బాధితుల నుంచి ఫిర్యాదులు అందటంతో కేసులు నమోదు చేశారు.

ED Cese On Prajapati

ED case On Prakash Prajapati :ఉద్యోగాల పేరుతో రూ.720కోట్లు (Rs 712 crore) మోసానికి పాల్పడిన ఆరోపణలతో గుజరాత్ కు చెందిన ప్రకాష్ ముల్‌చంద్ బాయ్ ప్రజా పతి(Prakash Mulchandbhai Prajapati) పై ఈడీ అధికారులు Enforcement Directorate (ED)కేసు నమోదు చేశారు. ప్రజాపతిపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)కింద కేసు నమోదు చేశారు. భారత్ తో పాటు పాలు దేశాలకు చెందిన ప్రజాపతి గ్యాంగ్ పై కేసులు నమోదు చేశారు అధికారులు.

దీంట్లో భాగంగా ప్రజాపతిపై తెలంగాణలోని హైద్రాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వందల కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బాధితుల నుంచి ఫిర్యాదులు అందటంతో కేసులు నమోదు చేశారు. బాధితు నుంచి అందిన ఫిర్యాదులతో నమోదైన కేసుల వివరాలను ఈడీ అధికారులు సేకరిస్తున్నారు. వందల కొద్దీ ఫిర్యాదు అందటంతో హైదరాబాద్ పోలీసులు ప్రకాష్ ప్రజాపతితో పాటు మరికొంతమంది నిందుతులను గత జులైలో అరెస్ట్ చేశారు.

ప్రజాపతి అతని గ్యాంగ్ కలిసి సోషల్ మీడియాల ద్వారా పార్ట్ టైమ్ జాబ్ లపేరుతో వారిని ఆకర్షించి ఇంటర్వ్యూ పేరుతో వారికి సింపుల్ గా టాస్కులు ఇచ్చేవారు. యూట్యూబ్ వీడియోలకు రివ్యూలు , గూగుల్ రేటింగ్ వంటి టాస్కులు ఇచ్చేవారు. ఈ టాస్కులు పూర్తి చేసిన వారిని డబ్బులు పెట్టుబడి పెట్టాలని దానికి వడ్డీ కూడా ఇస్తామంటూ ఆశ చూపేవారు. అలా చాలామంది ప్రజాపతి అండ్ కో గ్యాంగ్ బుట్టలో పడి వందలాదిమంది డబ్బులు పోగొట్టుకున్నారు. డబ్బులు పెట్టుబడి పెట్టాక కొంత కాలానికి వడ్డీ కాదు కదా..పెట్టిందీ రాకపోవటంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో వందల కొద్దీ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. ఈసీఐఆర్ జారీ చేసి ఎఫ్ఐఆర్ లు , కేసుల సమాచారాన్ని సేకరించారు ఈడీ అధికారులు.అనంతరం ప్రజాపతిని అతని గ్యాంగ్ లో కొంతమంది అరెస్ట్ చేశారు.

Hyderabad Begging mafia : వృద్ధులతో భిక్షాటన చేయిస్తున్న అనిల్ .. దీంతో అతనికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా..?

ప్రజాపతి గ్యాంగ్ ఉపయోగించిన 45 బ్యాంకు ఖాతాలను హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఒకే చిరునామాతో ఈ బ్యాంకు ఖాతాలను గుర్తించారు. ఈ నిధులు దుబాయ్ మీదుగా చైనాకు మళ్లించినట్టుగా ఈడీ గుర్తించింది. ప్రజాపతికి ఇండియాలో వ్యక్తిగతంగా ఉన్న ఆస్తుల విషయాన్ని ఈడీ ఆరా తీస్తోంది. దుబాయ్ నుండే ప్రజాపతి ముఠా ఈ మోసాలకు పాల్పడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. నిందితులు ఉపయోగించిన కంప్యూటర్ల ఐపీ అడ్రస్ లు దుబాయ్ కి చెందినవిగా అధికారులు తేల్చారు. డబ్బులో ఎక్కువ శాతం క్రిస్టో కరెన్సీలో నిర్వహించబడుతోంది ఈడీ గుర్తించింది.అలాగే హవాలా రూపంలో ఉగ్రవాదల సంస్థలకు నిధులు మళ్లిస్తున్నట్లుగా ఈడీ గుర్తించింది. ఉద్యోగాల పేరుతో దోచుకున్న డబ్బును చైనా, సింగపూర్, మలేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ లకు తరలించినట్లుగా కూడా ఈడీ విచారణలో తేలింది.  కాగా డబ్బులు పోగొట్టుకున్న బాధితులు ఎక్కువమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కావటం గమనించాల్సిన విషయం.

 

 

ట్రెండింగ్ వార్తలు