Father Rapes Daughter : కూతురిపై తండ్రి అత్యాచారం.. 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు

కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కామంతో కాటేశాడు. కన్న కూతురిపై నీచానికి ఒడిగట్టాడు.

Father Rapes Daughter : కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కామంతో కాటేశాడు. కన్న కూతురిపై నీచానికి ఒడిగట్టాడు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేశాడు. కన్న కూతురిపైనే దారుణానికి ఒడిగట్టిన ఆ నీచుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఏకంగా 20ఏళ్ల జైలు శిక్ష వేసింది.(Father Rapes Daughter)

కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి 20 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండలానికి చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు. బంధువుల ఇంట్లో శుభకార్యం నిమిత్తం పిల్లలను ఇంట్లోనే ఉంచి తల్లి వేరే గ్రామానికి వెళ్లింది. 2018 మే 16న మద్యం మత్తులో ఉన్న తండ్రి పెద్ద కూతురిపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక గర్భం దాల్చడంతో గర్భస్రావ మాత్రలు వేయించాడు. అనంతరం 2019 జూన్‌ 28న మరోసారి భార్యను కొట్టి కూతురిని తన దగ్గరికి పంపించాలంటూ బెదిరించాడు.

Whatsapp Chatting : వాట్సప్ చాటింగ్‌పై భార్యకు భర్త మందలింపు.. ఫలితం రెండు చావులు

భర్త నీచ ప్రవర్తన భరించలేకపోయిన భార్య రుద్రూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నీచుడిని అదుపులోకి తీసుకున్నారు. కూతురిపై తండ్రి దాష్టీకాన్ని సీరియస్‌గా పరిగణించిన న్యాయస్థానం కీచక తండ్రికి కఠిన శిక్ష విధించింది. ఆధారాలను
పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. న్యాయసేవా సంస్థ ద్వారా రూ.1.50 లక్షల పరిహారం కోసం బాలిక దరఖాస్తు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు.

Director Liju Krishna : సినీ దర్శకుడిపై అత్యాచార ఆరోపణలు-అరెస్ట్

ట్రెండింగ్ వార్తలు