Bihar: భూ తగాదా.. ఐదుగురు మహిళలపై కిరాతకంగా కాల్పులు జరిపిన ఓ వ్యక్తి

నిరుపేద కూలీలకు భూపంపిణీలో భాగంగా 1985లో సదరు మహిళలకు కొంత భూమి లభించింది. అయితే ఈ భూమిపై ఇద్దరు వ్యక్తులు కన్నేసి ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. అయితే 2004 నుంచి ఈ కేసు పెండింగులో ఉంది. ఇకపోతే, తాజాగా శిరిష్ దూబే అనే వ్యక్తి ట్రాక్టరుతో వచ్చి భూమిని దున్నడం ప్రారంభించాడు

Bihar: బిహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భూమి తగాదా ఐదుగురు మహిళల ఫ్రాణాల మీదకు తెచ్చింది. తమ భూమిని అక్రమంగా లాక్కునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే దానిపై వారు ప్రతిఘటించడంతో, ఆ ఐదుగురు మహిళలపై నిందితుడు కాల్పులు జరిపాడు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. కాగా, కాల్పులకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. రాష్ట్రంలోని పశ్చిమ చంపారణ్ జిల్లా నక్టి పట్వారా అనే గ్రామంలో జరిగిందీ దారుణం. కాల్పులు జరుపుతుండగా గ్రామస్థులు తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింటిని కుదిపివేస్తోంది.

Rahul Gandhi: చైనా, పాక్ ఒక్కటయ్యాయి, ఒకవేళ యుద్ధం వస్తే.. రాహుల్ గాంధీ

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నిరుపేద కూలీలకు భూపంపిణీలో భాగంగా 1985లో సదరు మహిళలకు కొంత భూమి లభించింది. అయితే ఈ భూమిపై ఇద్దరు వ్యక్తులు కన్నేసి ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. అయితే 2004 నుంచి ఈ కేసు పెండింగులో ఉంది. ఇకపోతే, తాజాగా శిరిష్ దూబే అనే వ్యక్తి ట్రాక్టరుతో వచ్చి భూమిని దున్నడం ప్రారంభించాడు. దీనిని ప్రతిఘటిస్తూ ఐదుగురు మహిళలు ఆ భూమిలోనే నిరసనకు దిగారు. అంతే, తీవ్ర కోపానికి గురైన దూబే, వారిపై కాల్పులు జరిపాడు.

Dhamaka Scenes : ధమాకా సినిమాలో ఈ పాటకి, ఆ సీన్ కి థియేటర్స్ దద్ధరిల్లిపోతున్నాయిగా.. ఎంటర్టైన్మెంట్ పీక్స్..

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించి తదుపరి పరిస్థితులు విషమించకుండా చూసుకున్నారు. నిందితుడు దూబేను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్లు బెట్టయ్య సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఉపేంద్రనాథ్ వర్మ తెలిపారు. భూమి ఎవరిదనే విషయమై విచారణ చేస్తున్నామని, ఆ వివరాలు రాగానే యజమానులకు భూకేటాయింపు చేస్తామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు