Bangalore Rave Party: వీడియో రిలీజ్ చేసి అందరినీ తప్పుదోవ పట్టించిన హేమ!

Bangalore Rave Party: మిస్ లీడ్ చేసిన హేమపై అధికారులు మరోకేసు పెట్టినట్లు..

బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ సంచలనం రేపుతోంది. ఆ పార్టీలో పలువురు టాలీవుడ్ నటీనటులు ఉన్నట్టు సమాచారం. తాను అసలు బెంగళూరులోనే లేనని, హైదరాబాద్ లోనే ఉన్నానని సినీ నటి హేమ ఇవాళ ఉదయం వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే, ఆమె ఈ వీడియో రిలీజ్ చేసి అందరినీ తప్పుదోవ పట్టించారని తెలుస్తోంది. మిస్ లీడ్ చేసిన హేమపై అధికారులు మరోకేసు పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం హేమ బెంగళూరులోని పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. పార్టీలో మొత్తం 101 మంది పాల్గొన్నారు.

వారిలో యువతులు 30 మంది, పురుషులు 71 మంది ఉన్నారు. మెడికల్ టీమ్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాయి. అందరి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నాయి. నిర్వాహకుడు వాసుతో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, నటి హేమ పేరు కన్నడ మీడియాలోనూ సర్య్కులేట్ అయింది. రేవ్ పార్టీలో సెలబ్రెటీలు, వీఐపీలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలిని నార్కోటిక్ అధికారులు పరిశీలించారు.

కవితకు మళ్లీ షాక్.. జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించిన కోర్టు

ట్రెండింగ్ వార్తలు