Cyber Crime : రూపాయితో రీఛార్జి అన్నాడు..రూ.11 లక్షలు కాజేశాడు

పోలీసులు ప్రజలను ఎంత అప్రమత్తత చేస్తున్నా... సైబర్   నేరగాళ్లు రోజు రోజుకు కొత్తకొత్త ట్రిక్కులతో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు.   తాజాగా హైదరాబాద్ లోని  ఒక వృధ్దుడి  ఖాతాలోంచి  రూ

Cyber Crime :  పోలీసులు ప్రజలను ఎంత అప్రమత్తత చేస్తున్నా… సైబర్   నేరగాళ్లు రోజు రోజుకు కొత్తకొత్త ట్రిక్కులతో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు.   తాజాగా హైదరాబాద్ లోని  ఒక వృధ్దుడి  ఖాతాలోంచి  రూ.11 లక్షలు కాజేసిన వైనం వెలుగు చూసింది.

హైదరాబాద్ కు  చెందిన  ఒక వృధ్ధుడి(70)కి   గుర్తు తెలియని వ్యక్తి  ఫోన్ చేసి ఓ నెట్‌వర్క్ సంస్ధ నుంచి ఫోన్ చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు.  కొన్ని గంటల్లో మీ సిమ్ కార్డు సేవలు   రద్దవుతాయని   ఈలోగా మీరు   ఒక రూపాయితో రీ చార్జి   చేయించుకుంటే సేవలు కొనసాగించబడతాయని చెప్పాడు.

Also Read : China Vaccination for Above 3 Years : మూడేళ్ల చిన్నారులకు టీకా వేసేందుకు చైనా ప్రయత్నాలు

రూపాయే కదా అని సరే అన్నాడు ఆ వృధ్దుడు. వెంటనే అవతలి వ్యక్తి  ఒక లింకు పంపించి దీన్ని  పూర్తి చేసి పంపించండని సలహా ఇచ్చాడు. నిజమని నమ్మిన వృధ్దుడు అందులో వివరాలు పొందు పరిచాడు. అవి పూర్తి చేయగానే నెట్ బ్యాంకింగ్ ద్వారా అతని బ్యాంకు ఖాతాలనుంచి రూ. 11 లక్షలు  విత్ డ్రా అయ్యాయి.  ఏమీ చెయ్యలేని వృధ్దుడు  సోమవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు   ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు