Jubilee Hills Gang Rape Case : జూబ్లీ‌హిల్స్ గ్యాంగ్‌ రేప్ కేస్ : మరో బాలికపైనా వేధింపులు

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆమ్నీషియా పబ్ రేప్ కేసు రిమాండ్‌ రిపోర్టులో సంచలనవిషయాలు వెలుగు చూసాయి. బాధిత బాలికతోపాటు మరో బాలికను యువకులు వేధించినట్లు తెలుస్తోంది.

Jubilee Hills Gang Rape Case :  హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆమ్నీషియా పబ్ రేప్ కేసు రిమాండ్‌ రిపోర్టులో సంచలనవిషయాలు వెలుగు చూసాయి. బాధిత బాలికతోపాటు మరో బాలికను యువకులు వేధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కార్పొరేటర్ కుమారుడే కీలక సూత్రధారిగా పోలీసులు చెపుతున్నారు.

సాదుద్దీన్‌ మాలిక్‌, కార్పొరేటర్‌ కొడుకు కలిసి ఇద్దరు పబ్ లోనే మైనర్ బాలికలను వేధింపులకు గురి చేశారు. అక్కడ వారివేధింపులు భరించలేక ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. బాలికల వెనకాలే సాదుద్దీన్ గ్యాంగ్ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన ఒక బాలిక వేరుగా క్యాబ్ తీసుకుని వెళ్లిపోయింది. పబ్ ముందే నిలబడ్డ బాధిత బాలికను కార్పొరేటర్ కొడుకు ట్రాప్ చేశాడు.

ఇంటి వద్ద దించుతామని గ్యాంగ్ బాలికను నమ్మించి…. మాజీ ఎమ్మెల్యే మనవడు ఉమేర్‌ఖాన్‌కు చెందిన బెంజ్‌ కారులో తీసుకువెళ్ళారు. ఆకారులో అమ్మాయితో కలిసి నలుగురు ప్రయాణించారు. పబ్ నుంచి నేరుగా కాన్సూ బేకరి వరకు గ్యాంగ్ వెళ్లింది. పబ్ నుంచి కాన్సూ బేకరీకి వెళ్లే లోపే బెంజ్‌ కారులోనే అమ్మాయి పట్ల గ్యాంగ్ అసభ్యకరంగా ప్రవర్తించింది. అరాచకాలు భరించలేక కాన్సూ బేకరి నుంచి బాధిత బాలిక వెళ్లిపోతానని చెప్పింది.

బాలికను మళ్లీ బెంజ్‌ కారులో ఎక్కించుకొని కొద్దిదూరం ప్రయాణించారు. ఎమ్మెల్యే కుమారుడికి ఫోన్ కాల్ రావటంతో మధ్యలోనే దిగి వెళ్లిపోయాడు. ఆతర్వాత బెంజ్‌ కారులో పెట్రోల్ అయ్యిపోయిందని చెప్తూ సాదూద్దీన్ గ్యాంగ్ డ్రామాలు ఆడింది. వెనుకాలే మరో ఇన్నోవాలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు వచ్చాడు. ఆ తర్వాత బాలికను గ్యాంగ్ ఇన్నోవాలోకి తరలించింది. బంజారాహిల్స్‌లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై గ్యాంగ్ అత్యాచారానికి పాల్పడింది.

అత్యాచారం తర్వాత నిందితులు బేకరికి వచ్చారు. ఎంజాయ్ చేశామని గ్రూప్ ఫోటో దిగి ఇన్‌స్టాలో పోస్టు చేశారు. బేకరి నుంచి నిందితులు ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. కేసు నమోదు కాగానే హైదరాబాద్ నుంచి నిందితులు పారిపోయారు. ఇన్నోవా కారును వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఫాంహౌస్‌లో నిందితులు దాచారు’’ అని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కోన్నారు. ఈకేసులో ఇప్పటికే ఒక మేజర్ తో సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : Police Torture : అరాచకం-యువకుడి మలద్వారంలో లాఠీ దూర్చి,కరెంట్ షాకిచ్చిన పోలీసులు

ట్రెండింగ్ వార్తలు