KKR Celebrations : మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోల్‌క‌తా ఆట‌గాళ్ల సెల‌బ్రెష‌న్స్ చూశారా..?

మ్యాచ్ అనంత‌రం డ్రెస్సింగ్ రూమ్‌లో కేకేఆర్ ఆట‌గాళ్ల సంబరాలు అంబ‌రాన్నంటాయి.

KKR dressing room Celebrations : దాదాపు రెండు నెల‌లుగా క్రికెట్ ప్రేమికుల‌ను అల‌రించిన ఐపీఎల్ 2024 సీజ‌న్ ముగిసింది. ఈ సీజ‌న్ మొత్తం అత్యుత్త‌మ ఆట‌తీరు ప్ర‌ద‌ర్శించిన కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఐపీఎల్ 17వ సీజ‌న్ విజేత‌గా నిలిచింది. ఆదివారం చెపాక్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై ఎనిమిది వికెట్ల తేడాతో కోల్‌క‌తా ఘ‌న విజయాన్ని సాధించింది. స‌రిగ్గా ప‌దేళ్ల త‌రువాత మ‌రోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. 17 ఏళ్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లో కేకేఆర్‌కు ఇది మూడో టైటిల్ కావ‌డం విశేషం.

ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. బ్యాట‌ర్లు ఘోరంగా విఫ‌లం కావ‌డంతో 18.3 ఓవ‌ర్ల‌లో 113 ప‌రుగుల‌కే ఆలౌటైంది. కెప్టెన్ క‌మిన్స్ (24) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ (0), అభిషేక్ శ‌ర్మ (2), రాహుల్ త్రిపాఠి (9), క్లాసెన్ (16), నితీశ్ రెడ్డి (13)లు విఫ‌లం అయ్యారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో ఆండ్రీ ర‌సెల్ మూడు వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్‌, హ‌ర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. వైభ‌వ్ ఆరోరా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి చెరో వికెట్ సాధించారు.

Gambhir : ఐపీఎల్ ఫైన‌ల్‌లో కేకేఆర్ విజ‌యం.. గంభీర్‌తో జైషా సుదీర్ఘ సంభాష‌ణ‌.. టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వి గురించేనా?

అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కోల్‌క‌తా 10.3 ఓవ‌ర్లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంక‌టేశ్ అయ్య‌ర్ (26 బంతుల్లో 52 నాటౌట్‌) అర్థ‌శ‌త‌కంతో చెల‌రేగ‌గా, రహ్మానుల్లా గుర్బాజ్ (39) రాణించాడు. స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో షాబాజ్ అహ్మద్, పాట్ క‌మిన్స్‌లు చెరో వికెట్ తీశారు.

డ్రెస్సింగ్ రూమ్‌లో అంబ‌రాన్నంటిన సంబరాలు..

మ్యాచ్ అనంత‌రం డ్రెస్సింగ్ రూమ్‌లో కేకేఆర్ ఆట‌గాళ్ల సంబరాలు అంబ‌రాన్నంటాయి. కేట్ క‌ట్ చేశారు. అనంత‌రం కేక్‌ను ఒక‌రినొక‌రు పూసుకున్నారు. క‌ప్పును ప‌ట్టుకుని డ్యాన్స్ ఆడారు. తెల్ల‌వారుజామున రెండు గంట‌ల వ‌ర‌కు వారు సంబరాలు చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. కేకేఆర్ సంబ‌రాల‌కు సంబంధించిన వీడియోను ఆ జ‌ట్టు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

IPL 2024 Prize Money : కోల్‌క‌తాకు రూ.20కోట్లు, స‌న్‌రైజ‌ర్స్ రూ.12.5కోట్లు, బెంగ‌ళూరుకు ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు