IPL 2024 Prize Money : కోల్‌కతాకు రూ.20కోట్లు, సన్‌రైజర్స్ రూ.12.5కోట్లు, బెంగళూరుకు ఎంతంటే?
దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది.

PIC Credit : IPL
IPL 2024 Prize Money : దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది. ఐపీఎల్ 17వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా నిలిచింది. ఆదివారం చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తాజా టైటిల్‌తో కలిపి ఇప్పటి వరకు కోల్‌కతా మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీలను ముద్దాడింది.
ఐపీఎల్ విజేతగా నిలవడంతో కోల్‌కతా రూ.20కోట్ల ప్రైజ్‌మనీని పొందింది. అటు రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు రూ.12.5 కోట్ల మొత్తం దక్కింది. అంతేకాదండోయ్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు పెద్ద మొత్తంలోనే ప్రైజ్‌మనీ అందింది. మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ జ్టటుకు రూ.7కోట్లు ఇవ్వగా, బెంగళూరుకు రూ.6.5కోట్లు అందాయి.
IPL 2024 Final : ఐపీఎల్ 2024 విజేత కేకేఆర్.. గౌతమ్ గంభీర్ ఏమని ట్వీట్ చేశారో తెలుసా?
15 మ్యాచుల్లో 61.75 సగటుతో ఓ సెంచరీ, ఐదు అర్థశతకాలతో 741 పరుగులు చేసిన కోహ్లికి ఆరెంజ్ క్యాప్ లభించింది. అలాగే ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన హర్షల్ పటేల్ (24 వికెట్లు)కు పర్పుల్ క్యాప్ దక్కింది. వీరిద్దరికి చెరో రూ.10లక్షల ప్రైజ్‌మనీని అందుకున్నారు.
ఐపీఎల్ 2024లో అవార్డులు, ప్రైజ్‌మనీ వివరాలు..
విజేత : కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ.20 కోట్లు)
రన్నరప్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ.12.5 కోట్లు)
మూడో స్థానం : రాజస్థాన్ రాయల్స్ (రూ.7కోట్లు)
నాలుగో స్థానం : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ.6.5 కోట్లు)
ఆరెంజ్ క్యాప్ : విరాట్ కోహ్లీ – 741 పరుగులు (రూ.10 లక్షలు)
పర్పుల్ క్యాప్ : హర్షల్ పటేల్ – 24 వికెట్లు(రూ.10 లక్షలు)
సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడు : సునీల్ నరైన్ (రూ.12 లక్షలు)
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ : నితీష్ కుమార్ రెడ్డి (రూ.20 లక్షలు)
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ : జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (రూ.10 లక్షలు)
అల్టిమేట్ ఫాంటసీ ప్లేయర్ : సునీల్ నరైన్ (రూ.10 లక్షలు)
సీజన్‌లో అత్యధిక సిక్సర్లు : అభిషేక్ శర్మ (రూ.10 లక్షలు)
సీజన్‌లో అత్యధిక ఫోర్లు : ట్రావిస్ హెడ్ (రూ. 10 లక్షలు)
క్యాచ్ ఆఫ్ ద సీజన్ : రమణదీప్ సింగ్ (రూ. 10 లక్షలు)
బెస్ట్ పిచ్ సీజన్ గ్రౌండ్ : రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ (రూ.50 లక్షలు)
ఫెయిర్‌ప్లే అవార్డు : సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ.10 లక్షలు)
IPL 2024 : ఫైనల్లో ఓడిన హైదరాబాద్ జట్టుపైనా కాసుల వర్షం.. ఎంత ఫ్రైజ్‌మనీ వచ్చిందో తెలుసా?
ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన అవార్డులు ఇవే..
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : మిచెల్ స్టార్క్ (రూ.5 లక్షలు)
అల్టిమేట్ ఫాంటసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : మిచెల్ స్టార్క్ (రూ. లక్ష)
ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ : వెంకటేష్ అయ్యర్ (రూ. లక్ష)
గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది మ్యాచ్ : హర్షిత్ రాణా (రూ. లక్ష)
మ్యాచ్‌లో అత్యధిక ఫోర్లు : రహ్మానుల్లా గుర్బాజ్ (రూ.లక్ష)
మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు : వెంకటేష్ అయ్యర్ (రూ. లక్ష)
??? ????? ??? ??? ??????? ?
Congratulations to the @KKRiders for clinching the 2024 #TATAIPL! The team showed great consistency throughout the tournament and kudos to @ShreyasIyer15 for leading the side brilliantly. Once again, thank you to the fans for… pic.twitter.com/WhU7Hc0RJr
— Jay Shah (@JayShah) May 26, 2024