IPL 2024 : ఫైన‌ల్లో ఓడిన హైద‌రాబాద్‌ జట్టుపైనా కాసుల వర్షం.. ఎంత ఫ్రైజ్‌మ‌నీ వచ్చిందో తెలుసా?

ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకూడా కోట్ల రూపాయలను దక్కించుకుంది.

IPL 2024 : ఫైన‌ల్లో ఓడిన హైద‌రాబాద్‌ జట్టుపైనా కాసుల వర్షం.. ఎంత ఫ్రైజ్‌మ‌నీ వచ్చిందో తెలుసా?

Sunrisers Hyderabad

IPL 2024 Prize Money : ఐపీఎల్ 2024 సీజన్ ట్రోపీని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు పరుగులు రాబట్టడంలో విఫలమైంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు కేవలం 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి 2024 ఐపీఎల్ విజేతగా నిలిచారు. ట్రోపీని గెలచుకున్న కేకేఆర్ జట్టుతో పాటు ఫైనల్లో ఓడిపోయిన హైదరాబాద్ జట్టుపైనా కాసుల వర్షం కురిసింది.

Also Read : IPL 2024 Final : ఐపీఎల్ 2024 విజేత కేకేఆర్.. గౌతమ్ గంభీర్ ఏమని ట్వీట్ చేశారో తెలుసా? 

శ్రేయాస్ సారథ్యంలోని కేకేఆర్ జట్టు ఐపీఎల్ ట్రోపీతో పాటు ఫ్రైజ్ మనీ రూ. 20కోట్లు గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకూడా కోట్ల రూపాయలను దక్కించుకుంది. ఈ టోర్నీలో రన్నరప్ గా నిలిచిన ఫ్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఫ్రైజ్ మనీగా రూ. 12.5కోట్లు లభించాయి. టోర్నీలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు కూడా కోట్లలో ఫ్రైజ్ మనీ దక్కింది. మూడో స్థానంలో రాజస్థాన్ రాయల్స్, నాల్గో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు నిలిచాయి. వీరిలో ఒక్కొక్క జట్టుకు రూ. 7కోట్లు చొప్పున ఫ్రైజ్ మనీ లభించింది.

Also Read : IPL 2024 : అయ్యయ్యో.. ఎస్ఆర్‌హెచ్‌ ఓటమితో ఏడ్చేసిన కావ్యా పాప.. వీడియో వైరల్

ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ ను విరాట్ కోహ్లీ దక్కించుకున్నాడు. ఆర్సీబీ జట్టు బ్యాటర్ గా కోహ్లీ (741 పరుగులు) ఈ సీజన్ లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు (24వికెట్లు) తీసిన పంజాబ్ కింగ్స్ జట్టు బౌలర్ హర్షల్ పటేల్ పర్సుల్ క్యాప్ దక్కించుకున్నాడు. వీరితో పాటు అత్యంత విలువైన ఆటగాడిగా సునీల్ నరైన్ ఎంపికయ్యాడు. అతను కోల్ కతా తరపున 488 పరుగులతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు. ఉత్తమ వర్ధమాన ఆటగాడిగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్ నితీశ్ కుమార్ ఎంపికయ్యాడు. నితీశ్ తొలిసారి ఐపీఎల్ సీజన్ లో ఆడుతూ 303 పరుగులు చేశాడు. వీరితోపాటు ఇతర అవార్డులు పొందిన వారికి రూ. 10లక్షల చొప్పున ఫ్రైజ్ మనీ లభించింది.