IPL 2024 Final : ఐపీఎల్ 2024 విజేత కేకేఆర్.. గౌతమ్ గంభీర్ ఏమని ట్వీట్ చేశారో తెలుసా? 

కేకేఆర్ జట్టు మెంటర్ గా గంభీర్ వచ్చిన తరువాత ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ తో పాటు, బౌలింగ్ అటాక్ ను కూడా మార్చేశారు.

IPL 2024 Final : ఐపీఎల్ 2024 విజేత కేకేఆర్.. గౌతమ్ గంభీర్ ఏమని ట్వీట్ చేశారో తెలుసా? 

Gautam Gambhir

Gautam Gambhir : ఐపీఎల్ 2024 ట్రోపీని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కేకేఆర్ ఘన విజయం సాధించింది. కేకేఆర్ విజయంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, జట్టు సభ్యులతోపాటు మెంటార్ గౌతం గంభీర్ కీలక పాత్ర పోషించారు. కేకేఆర్ జట్టు విజయం తరువాత గంభీర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జట్టు విజయం అనంతరం మైదానంలోకి వచ్చిన కేకేఆర్ జట్టు యాజమాని షారూక్ ఖాన్ గౌతమ్ గంభీర్ ను హత్తుకొని అభినందనలు తెలిపారు. అయితే, కేకేఆర్ విజయం తరువాత గంభీర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Also Read : Shah Rukh Khan : కేకేఆర్ విజయంతో ఎమోషనల్ అయిన షారుఖ్ ఫ్యామిలీ.. ఏడుస్తూ నాన్నని హత్తుకున్నా సుహానా ఖాన్..

కేకేఆర్ జట్టు మెంటార్ గా గంభీర్ వచ్చిన తరువాత ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ తో పాటు, బౌలింగ్ అటాక్ ను కూడా మార్చేశారు. సునీల్ నరైన్ ను ఓపెనర్ గా పంపించాలన్న గంభీర్ నిర్ణయం.. అద్బుత ఫలితాలను ఇచ్చింది. ఐపీఎల్ లో మేటి ప్రాంచైజీల్లో ఒకటిగా కేకేఆర్ జట్టు కూడా ఉందంటే నిస్సందేహంగా అందుకు ప్రధాన కారణాల్లో గంభీర్ ఒకరు. గతంలోనూ గంభీర్ కెప్టెన్సీలోనే 2012, 2014 సంవత్సరాల్లో కేకేఆర్ జట్టు ఐపీఎల్ ట్రోపీలను కైవసం చేసుకుంది. ఆ తరువాత అతను కేకేఆర్ జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం 2024 ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ జట్టు టైటిల్ నెగ్గడంలో గంభీర్ మెంటార్ గా కీలక భూమిక పోషించారు.

Also Read : IPL 2024 : అయ్యయ్యో.. ఎస్ఆర్‌హెచ్‌ ఓటమితో ఏడ్చేసిన కావ్యా పాప.. వీడియో వైరల్

కేకేఆర్ జట్టు ఐపీఎల్ 2024 ట్రోపీని కైవసం చేసుకున్న తరువాత గౌతమ్ గంభీర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఎవరి ఆలోచనలు, చర్యలు సత్యంపై ఆధారపడి ఉంటాయో వారికి ఇప్పటికీ శ్రీకృష్ణుడే రథసారథి’ అంటూ గంభీర్ హిందీలో ట్వీట్ చేశాడు. గంభీర్ పోస్టుపై అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. సోమవారం ఉదయం వరకు గంభీర్ పోస్టును 63వేల మంది లైక్ చేశారు. పలువురు గంభీర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ రీ ట్వీట్లు చేశారు.