Gold And Silver Price Today : బంగారం, వెండి ధరలు ఒక్కోరోజు తగ్గుతూ.. ఒక్కోరోజు పెరుగుతూ వస్తున్నాయి. గత వారంరోజులుగా బంగారం ధర తగ్గుతూ వచ్చింది. వారంలో 10గ్రాముల గోల్డ్ పై సుమారు రూ.3వేలు తగ్గింది. దీంతో పసిడి ప్రేమికులు బంగారం కొనుగోలుకు సిద్ధమయ్యారు. కానీ, ఇంతలోనే వారికి ఝలక్ ఇస్తూ బంగారం ధర మళ్లీ పెరిగింది. వెండిధర సైతం పెరిగింది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 270 పెరగ్గా.. కిలో వెండిపై రూ. 1500 పెరిగింది.
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,650కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,710.
- దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,800 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,860.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,650 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,710.
చెన్నైలో బంగారం ధర భారీగా పెరిగింది. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 650 పెరగ్గా.. 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 710 పెరిగింది. దీంతో అక్కడ 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,200 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.73,310.
- వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా వెండి ధర భారీగా పెరిగింది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.97,500.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ.97,500.
కోల్ కతా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.93,000.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 93,500 కు చేరింది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.