Samsung Galaxy A35 : ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్.. ఈ శాంసంగ్ A35 ధర భారీగా తగ్గిందోచ్.. ఏకంగా రూ. 14వేలు డిస్కౌంట్.. ఎలాగంటే?
Flipkart Republic Day Sale : కొత్త శాంసంగ్ గెలాక్సీ A35 ఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ ఏకంగా రూ. 14వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Flipkart Republic Day Sale : Samsung Galaxy A35 (Image Credit To Original Source)
- జనవరి 17న ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం
- బ్యాంక్ ఆఫర్లతో రూ. 15వేల కన్నా తక్కువ ధరకే
- శాంసంగ్ గెలాక్సీ A35 ప్లాట్‌ఫామ్‌పై భారీ తగ్గింపు
- 5 శాతం క్యాష్‌బ్యాక్, రూ.3,167 నుంచి ఈఎంఐ ఆప్షన్లు
Flipkart Republic Day Sale : శాంసంగ్ లవర్స్ గెట్ రెడీ.. అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం కానుంది. ఈ-కామర్స్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లతో సహా అనేక కేటగిరీలలో భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. జనవరి 17న రిపబ్లిక్ డే సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ A35 ప్లాట్‌ఫామ్‌పై భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.
ఈ శాంసంగ్ ఫోన్ మొదట్లో రూ. 32,999 ధరకు లభిస్తుండగా, ప్రస్తుత డిస్కౌంట్ బ్యాంక్ ఆఫర్లతో రూ. 15వేల కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్లాట్‌ఫామ్‌లో అత్యంత ఆకర్షణీయమైన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటిగా చెప్పొచ్చు.
ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే రెడీగా ఉండండి. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A35 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A35 డీల్ :
ఈ శాంసంగ్ ఫోన్ రూ.32,999 ధరకు లాంచ్ కాగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,500 తగ్గింపుతో లభిస్తోంది. తద్వారా ధర రూ.18,999కి తగ్గుతుంది. అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కస్టమర్‌లు రూ.4వేల వరకు అదనంగా 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. పేమెంట్ల కోసం ఈ ప్లాట్‌ఫామ్ కొనుగోలుదారులకు రూ.3,167 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తుంది.

Flipkart Republic Day Sale : Samsung Galaxy A35 (Image Credit To Original Source)
ఆసక్తిగల కొనుగోలుదారులు పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకుంటే ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రోగ్రామ్ పొందవచ్చు. రూ. 15,350 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. అయితే, బోనస్ మొత్తం రావాలంటే పాత ఫోన్, బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ A35 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ A35 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 1,900 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. హుడ్ కింద ఈ శాంసంగ్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. అడ్రినో 710 జీపీయూతో కూడా వస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.
ఈ శాంసంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6 జనరేషన్ ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లకు 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందిస్తుంది. ఇంకా, ఈ శాంసంగ్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.
ఆప్టిక్స్ పరంగా శాంసంగ్ గెలాక్సీ A35 ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా ఉంది.
