Happy Makar Sankranti 2026 : హ్యాపీ మకర సంక్రాంతి.. వాట్సాప్‌లో సంక్రాంతి స్టిక్కర్లు, AI ఫొటోలు కావాలా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..
Happy Makar Sankranti 2026 : మకర సంక్రాంతి సందర్భంగా వాట్సాప్‌లో స్టిక్కర్లు, ఏఐ ఫొటోలు ఎలా క్రియేట్ చేయాలి? ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం..
Happy Makar Sankranti 2026 (Image Credit To Original Source)
- జనవరి 14న హ్యాపీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2026
- వాట్సాప్‌లో మకర సంక్రాంతి స్టిక్కర్లు డౌన్‌లోడ్
- వాట్సాప్ మెటా ఏఐ జనరేటెడ్ కోట్స్, ఫొటోలు
Happy Makar Sankranti 2026 : హ్యాపీ మకర సంక్రాంతి.. ఈరోజు జనవరి 14 (బుధవారం) మకర సంక్రాంతి సందర్భంగా దేశమంతటా మకర సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా కూడా సందడిగా ఉంటుంది.
వాట్సాప్ యూజర్లంతా తమ స్నేహితులు, బంధువులకు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఫొటోలు పోస్టులు చేస్తుంటారు. మీరు కూడా మీకు ఇష్టమైనవారికి సంక్రాంతి పండగ విషెస్ చెప్పాలని అనుకుంటున్నారా?
మీకోసం వాట్సాప్ లో అద్భుతమైన స్టిక్కర్లు అందుబాటులో ఉన్నాయి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు పండుగ శుభాకాంక్షలు, స్టిక్కర్లు, ఏఐ జనరేటెడ్ ఫొటోలను పంపుకోవచ్చు. ఇంతకీ, మకర సంక్రాంతి స్టిక్కర్లను ఎలా డౌన్‌లోడ్ చేయాలి? వాట్సాప్ కోసం ఏఐ ఫొటోలను ఎలా జనరేటెడ్ చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం..
వాట్సాప్‌లో మకర సంక్రాంతి స్టిక్కర్లు డౌన్‌లోడ్ ఎలా? :
- మీ వాట్సాప్ ఓపెన్ చేసి చాట్ (Chat)కి వెళ్లండి.
- స్టిక్కర్ సెక్షన్‌లో స్టిక్కర్ ప్యాక్‌ల కోసం ప్లస్ (+) ఐకాన్ ట్యాప్ చేయండి.
- స్పెషల్ మకర సంక్రాంతి స్టిక్కర్ ప్యాక్ అందుబాటులో ఉండవు.
- ఇప్పుడు, గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ ఓపెన్ చేయాలి.
- మకర సంక్రాంతి స్టిక్కర్లు కోసం సెర్చ్ చేయండి.
- మీకు నచ్చిన ఏదైనా ఒక యాప్ ఎంచుకుని డౌన్‌లోడ్ చేయండి.
- ఆపై ఇన్ స్టాల్ చేసి వాట్సాప్ యాక్సస్ కోసం యాప్‌కు పర్మిషన్ ఇవ్వండి.
- మీ వాట్సాప్‌లో కొత్త మకర సంక్రాంతి స్టిక్కర్ ప్యాక్‌లను చూడవచ్చు.

Happy Makar Sankranti 2026 (Image Credit To Original Source)
వాట్సాప్‌లో ఏఐ జనరేటెడ్ మకర సంక్రాంతి ఫొటోలు ఎలా పంపాలి? :
- మీరు మకర సంక్రాంతి కోట్స్, ఫొటోలను గూగుల్‌లో సెర్చ్ చేసి ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- వాట్సాప్‌లో ఏఐ ఫొటోల కోసం ChatGPT, Gemini, Meta కూడా ట్రై చేయొచ్చు.
- ఇప్పుడు, వాట్సాప్‌లో AI ఫొటోలను ఈ కింది విధంగా ఈజీగా జనరేట్ చేయొచ్చు.
- వాట్సాప్ ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్‌లో మెటా ఏఐ ఐకాన్ ట్యాప్ చేయండి.
- మకర సంక్రాంతి ఫొటోలు అనే ప్రాంప్ట్ రిజస్టర్ చేయండి.
- మెటా ఏఐ ఫొటో మీ కాంటాక్టులతో నేరుగా షేర్ చేయొచ్చు.
