ఏపీలో నెత్తురోడిన రహదారులు.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మృతి .. దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన చంద్రబాబు

ఏపీలో రోడ్లు నెత్తురోడాయి.. వేరువేరు ఘటనల్లో జరిగిన ప్రమాదాల్లో పది మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. రెండు ప్రమాదాల్లో నలుగురు చొప్పున మరణించగా.. మరో ప్రమాదం ఇద్దరు మృతిచెందారు.

Road Acciedents : ఏపీలో రోడ్లు నెత్తురోడాయి.. వేరువేరు ఘటనల్లో జరిగిన ప్రమాదాల్లో పది మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. రెండు ప్రమాదాల్లో నలుగురు చొప్పున మరణించగా.. మరో ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. విజయవాడ, కాకినాడ, తిరుపతి జిల్లాల్లో ఈ ప్రమదాలు చోటు చేసుకున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఎం.కొంగరవారిపల్లి దగ్గర కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారు. నెల్లూరు నుంచి వేలూరు సీఎంసీ హాస్పటల్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు.

Also Read : Cyber Attacks on India : సైబర్ క్రైమ్ గ్రూపులకు చైనాతో లింకులు.. 4 నెలల్లో రూ.7వేల కోట్ల స్కామ్

కృష్ణా జిల్లా తెలప్రోలు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుండి ఏలూరువైపు వెళ్తున్న లారీని ఏలూరు నుండి విజయవాడ వైపు వస్తున్న కారు ఫుట్ పాత్ పై నుండి వచ్చి వేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికుల్లో నలుగురు మృతిచెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనా స్థలానికి వీరవల్లి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తమిళనాడుకు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు. స్వామినాథన్ (40), కొడుకు రాకేష్(12), కూతురు రాధాప్రియ(14), స్వామి నాథన్ బంధువు గోపి(23)గా పోలీసులు గుర్తించారు. స్వామినాథన్ భార్య సత్యకి తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ హాస్పిటల్ కు తరలించారు.

Also Read : IPL 2024 : అయ్యయ్యో.. ఎస్ఆర్‌హెచ్‌ ఓటమితో ఏడ్చేసిన కావ్యా పాప.. వీడియో వైరల్

కాకినాడ జిల్లాలోనూ రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గంపేట మండలం రామవరం వద్ద కేవిఆర్ ట్రావెల్ బస్సు వెనుక నుంచి కారును ఢీకొట్టింది. దీంతో ఆగిఉన్న ఐచర్ వ్యాన్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఇరుక్కున్న డ్రైవర్ ను పోలీసులు స్థానికుల సాయంతో బయటకు తీశారు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అతను మృతి చెందాడు. మృతులు విజయనగరం వాసులుగా గుర్తించారు. మృతిచెందిన వి.మోహన్ కుమార్ హైదరాబాద్ కోర్టు పరిధిలో జిల్లా కోర్టు జడ్జిగా పనిచేస్తున్నారని సమాచారం. ప్రైవేట్ ట్రావెల్ బస్సు అతివేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

Also Read : Rajkot Fire : గుజరాత్ రాజ్‌కోట్ అగ్నిప్రమాద ఘటనలో 33కు చేరిన మృతుల సంఖ్య

రాష్ట్రంలో వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో పది మంది మృతి చెందడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఎం.కొంగవరం, కృష్ణాజిల్లా కోడూరుపాడు, కాకినాడ జిల్లా రాయవరం వద్ద జరిగిన ప్రమాదాల్లో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని అన్నారు.

రాష్ట్రంలో వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో పదిమంది దుర్మరణం పాలైన సంఘటనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు