Lucknow Building Collapse: లక్నోలో బిల్డింగ్ కూలి ముగ్గురు మృతి.. శిథిలాల కింద మరింత మంది.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణా బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటివరకు శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని అధికారులు రక్షించారు.

Lucknow Building Collapse: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో నాలుగంతస్థుల బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. లక్నోలోని, హజ్రత్ గంజ్ ప్రాంతంలోని ఒక నాలుగంతస్థుల భవనం మంగళవారం రాత్రి కూలిపోయింది.

Gujarat: గుజరాత్‌లో ఢిల్లీ తరహా ఘటన.. యువకుడిని ఢీకొని 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన కారు.. యువకుడు మృతి

ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణా బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటివరకు శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని అధికారులు రక్షించారు. ఇంకా కొందరు శిథిలాల కిందే ఉన్నారు. వారిని కూడా సురక్షితంగా రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా ఐదుగురు శిథిలాల కింద ఉన్నట్లు గుర్తించారు. వారిలో ఇద్దరితో మాట్లాడారు. వారికి ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Pawan Kalyan : నాటు నాటు ఆస్కార్ గెలవాలి.. పవన్ కళ్యాణ్!

శిథిలాల తొలగింపు, బాధితుల్ని రక్షించే ప్రయత్నాలు అన్నీ శాస్త్రీయంగా జరుగుతున్నాయని ఉత్తర ప్రదేశ్ డీజీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఎవరికీ ఎలాంటి హానీ కలగకుండా బాధితుల్ని రక్షిస్తామని హామీ ఇచ్చారు. అయితే, కూలిపోయిన బిల్డింగ్‌కు ఎలాంటి అనుమతీ లేదన్నారు. బిల్డింగ్ యజమానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతానికి ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు