Delhi: తన మీద తప్పుడు కేసు పెట్టారని పోలీస్ స్టేషన్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు

ఖాళీగా ఉన్న ప్రదేశం చూసి ఆనంద్ శర్మ కిందకు దూకాడు. తీవ్రంగా గాయాలపాలైన అతడిని ఎన్ఎన్‭జేపీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరణించిన వ్యక్తి ఉత్తమ్ నగర్ నివాసి అని పోలీసులు తెలిపారు. ఉద్యోగాల పేరుతో అమాయకుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారన్న కేసులో అతడిని అరెస్ట్ చేశారు

Delhi: 14 లక్షల తప్పుడు కేసులో ఇరికించారనే అవమానంతో ఒక వ్యక్తి ఏకంగా పోలీస్ స్టేషన్ మీద ఉన్న వాటర్ ట్యాంకు మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలోని కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఆదివారం జరిగిన ఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి పేరు ఆనంద్ వర్మ(45). పోలీస్ స్టేషన్‭లోని మూడవ అంతస్థులో తిరుగుతూ పోలీసులకు కనిపించాడు. అయితే అతడిని కిందకి రావాలంటూ పోలీసులు కోరారు. అలారాలు మోగించి, చిన్నపాటి స్పీకర్ సహాయంతో విజ్ణప్తి చేసినప్పటికీ ఆనంద్ వినలేదు.

Mumbai: మనీ లాండరింగ్ కేసులో ఈడీ తనిఖీలు.. ఐదున్నర కోట్ల విలువైన నగలు, కోటికిపైగా నగదు స్వాధీనం

ఖాళీగా ఉన్న ప్రదేశం చూసి ఆనంద్ శర్మ కిందకు దూకాడు. తీవ్రంగా గాయాలపాలైన అతడిని ఎన్ఎన్‭జేపీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరణించిన వ్యక్తి ఉత్తమ్ నగర్ నివాసి అని పోలీసులు తెలిపారు. ఉద్యోగాల పేరుతో అమాయకుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారన్న కేసులో అతడిని అరెస్ట్ చేశారు. అయితే వాస్తవానికి ఈ కేసులో ఆనంద్ శర్మకు సంబంధం లేదట. హెడ్ కానిస్టేబుల్ అజీత్ సింగ్ తప్పుడు ఉద్దేశంతో శర్మను ఇరికించాలని కేసు నమోదు చేశారట. తమ విచారణలో ఈ విషయం వెల్లడైనట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అజిత్ సింగ్ మీద సస్పెన్షన్ విధించినట్లు ఆయన పేర్కొన్నారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌కు బెయిల్

ట్రెండింగ్ వార్తలు