Attck On Police Station : పోలీసు స్టేషన్‌పై దాడి 53 మంది అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో ఓ పోలీసు స్టేషన్ పై దాడి చేసిన ఘటనలో 53 మంది విదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Attck On Police Station : దేశ రాజధాని ఢిల్లీలో ఓ పోలీసు స్టేషన్ పై దాడి చేసిన ఘటనలో 53 మంది విదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారంతా నైజీరియన్ దేశస్ధులుగా భావిస్తున్నారు.

సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి గుంపుగా వచ్చిన నైజీరియన్లు ద్వారకా జిల్లాలోని మోహన్ గార్డెన్ పోలీసు స్టేషన్ పై కర్రలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒక ఏఎస్సైతో సహా ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. పోలీసు స్టేషన్ లోకి ప్రవేశించిన నైజీరియన్లు తీవ్ర విధ్వంసం సృష్టించారు.

ఇటీవల ప్రాణాపాయ స్ధితిలో ఉన్న ఒక నైజీరియన్ వ్యక్తిని నైజీరియన్లు ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆ వ్యక్తికి చికిత్స అందించే విషయంలో డాక్టర్లు పోలీసులను సంప్రదించారు. పోలీసులు కేసు నమోదు చేయటంలో ఆలస్యం అవటంతో నైజీరియన్లు పోలీసులపై ఆగ్రహించారు. దాంతో వారిమధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలో సరైన వైద్యం అందక ఆ వ్యక్తి మరణించాడు.
Also Read : Bengaluru Financier kills wife : అందమైన భార్య…అనుమానంతో భర్త…!

పోలీసుల నిర్లక్ష్యంతోనే ఆ వ్యక్తి మరణించాడనే ఆగ్రహంతో నైజీరియన్లు ఉన్నారు. అప్పటి నుంచి అక్కడ పరిస్ధితి నివురు గప్పిన నిప్పులాగా ఉంది. దీంతో నైజీరియన్లు పోలీసు స్టేషన్ మీదకు దాడికి పాల్పడ్డారు. దాడి చేసినవారిలో 53 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఢిల్లీ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న పలువురు ఆఫ్రికన్ జాతీయులు అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం నిర్వహిస్తున్నారని వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. నైజీరియన్లు పోలీసు స్టేషన్ పై దాడికి అదికూడా ఒక కారణమని భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు