heart attacked by Chickens : డీజే సౌండ్‌కు కోళ్లకు గుండెపోటు…63 కోళ్లు కన్నుమూత

పెళ్ళి సందర్భంగా పెట్టిన డీజే సౌండ్ తో కోళ్లకు గుండెపోటు వచ్చింది. ఆ సౌండ్ కు 63 కోళ్లు గిలగిలా కొట్టుకుని చనిపోయిన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది.

heart attacked by Chickens :  పెళ్ళి సందర్భంగా పెట్టిన డీజే సౌండ్ తో కోళ్లకు గుండెపోటు వచ్చింది. ఆ సౌండ్ కు 63 కోళ్లు గిలగిలా కొట్టుకుని చనిపోయిన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది.

బాలాసోర్‌కు చెందిన రంజిత్ అనే యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. సరైన ఉద్యోగం దొరక్కపోవటంతో రూ.2లక్షల బ్యాంకు లోన్ తీసుకుని కోళ్ల ఫారం పెట్టుకున్నాడు. ఆదివారం రాత్రి కోళ్లఫారం పక్కన ఉన్న ఇంటిలో పెళ్లి జరిగింది.  రాత్రి గం.11-30 సమయంలో పెళ్లి వారింట్లో చెవులకు చిల్లలు పడేలా డీజే సౌండ్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. |
Also Read : Delhi Air Quality Index : ఢిల్లీలో తగ్గిన వాయుకాలుష్యం-29 నుంచి స్కూళ్లు ప్రారంభం
ఒక వైపు పెళ్లి జరుగుతోంది. మరోవైపు డీజే హోరులో ఆప్రాంతమంతా మారుమోగి పోతోంది. డీజే సౌండ్ కి   పక్కనే ఉన్న కోళ్లఫారంలోని కొన్ని కోళ్లు తట్టుకోలేక పోయాయి. అవి అటూ ఇటూ కొట్టుకుంటూ కింద పడిపోయాయి. అది గమనించిన రంజిత్ వెంటనే పెళ్లి వారింటికి వెళ్లి డీజే  సౌండ్ తగ్గించుకోమని కోరాడు. అయినా వారు వినలేదు.

డీజే ఆపే లోపల   కోళ్లఫారంలోని   63 కోళ్లు గిలగిల కొట్టుకుని మృత్యువాత పడ్డాయి. మరణించిన కోళ్లను మర్నాడు వెటర్నరీ డాక్టర్ కు చూపించగా అవి అన్నీ గుండెపోటుతో  మరణించినట్లు డాక్టర్ తెలిపారు. తన కోళ్ల చావుకు డీజేనే కారణమని రంజిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వింత కేసును  ఇప్పుడు ఒడిషాలోని బాలాసో ర్ పోలీసులు ఎలా సాల్వ్ చేస్తారో వేచి చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు