Palghar Railway Station: ఇండియాలో ఉండాలంటే మోదీ, యోగీలకు ఓటేయాలి.. ఒక సబ్‭ఇన్స్‭క్టర్, ముగ్గురు ముస్లింల‭ను కాల్చి చంపిన అనంతరం కానిస్టేబుల్ లెక్చర్లు

పశ్చిమ రైల్వే ఈ ఘటనపై ప్రకటన విడుదల చేసింది. పాల్ఘర్ రైల్వే స్టేషన్ దాటిన తరువాత కదులుతున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడని పేర్కొంది

Jaipur-Mumbai Express: మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం జరిగింది. ప్రయాణిస్తున్న జైపూర్-ముంబై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లోపల చేతన్ కుమార్ చౌదరి అనే RPF కానిస్టేబుల్.. తన ఆటోమేటిక్ రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ముగ్గురు ప్రయాణికులు ఉండగా ఒకరు అతడి సూపరిండెంట్ ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ టికా రామ్ మీనా కూడా ఉన్నారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది. కాగా, కాల్పులు జరిపిన అనంతరం.. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రయాణికులను ఉద్దేశించిన చేతన్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.

Supreme Court: ఎఫ్ఐఆర్ చేయమని కోర్టు చెప్పాక 14 రోజులు ఏం చేశారు? మణిపూర్ ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు

‘‘మన దేశ మీడియా ఈ వార్తను చూపిస్తుంది. వారికి ఇది తొందరలోనే తెలిసిపోతుంది. అందరికీ తెలిసిపోతుంది. వాళ్ల యజమాని ఉన్నాడు. ఒక వేళ మీరు ఓటు వేయదలుచుకుంటే, ఒకవేళ మీరు హిందుస్తాన్(ఇండియా)లో ఉండాలనుకుంటే నేను చెప్పినట్లు విని మోదీ, యోగిలకు ఓటు వేయండి. ఈ ఇద్దరు కాకుండా మీ థాకరే కూడా ఉన్నారు’’ అని కానిస్టేబుల్ చేతన్ అన్నాడు. ఈ మాటల వీడియోను నెటిజెన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు (Jaipur Express Train) జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న క్రమంలో కాల్పులు జరిగినట్లు తెలిసింది. అయితే, ఈ కాల్పులు జరిపింది ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ చేతన్ సింగ్‌ (Chetan Singh) గా గుర్తించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ మానసిక ఒత్తిడికి గురవుతున్నాడని చెబుతున్నారు.

పశ్చిమ రైల్వే ఈ ఘటనపై ప్రకటన విడుదల చేసింది. పాల్ఘర్ రైల్వే స్టేషన్ దాటిన తరువాత కదులుతున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడని పేర్కొంది. అతను జరిపిన కాల్పుల్లో ఒక ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, మరో ముగ్గురు ప్రయాణికులు మరణించారని తెలిపింది. కాల్పుల అనంతరం దహిసర్ స్టేషన్ సమీపంలో నిందితుడు రైలు బయటకు దూకాడని, అయితే, స్థానిక పోలీసులు కానిస్టేబుల్‌తో సహా, అతని వద్ద ఉన్న ఆయుధాన్ని అదుపులోకి తీసుకోవటం జరిగిందని పశ్చిమ రైల్వే పేర్కొంది. ప్రస్తుతం రైలులోని ప్రయాణికుల వాగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు.

అదృష్టవశాత్తూ నిందితుడు జరిపిన కాల్పుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు గాయపడలేదు. అయితే, నిందితుడు ఎందుకు కాల్పులు జరిపాడు, కాల్పులకు ముందు ఏమైనా ఘర్షణ జరిగిందా? మతిస్థిమితం సరిగా లేక కాల్పులు జరిపాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉంటే, రైలులోని బీ5 కోచ్‌లో ఈ కాల్పులు ఘటన జరిగింది. పాల్ఘర్ రైల్వే స్టేషన్ ముంబై నుంచి 100 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ రైలు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ జంక్షన్ నుంచి రాత్రి 2గంటలకు బయలుదేరి ఉదయం 6.55 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది.

ట్రెండింగ్ వార్తలు