హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడితో పాటు పలువురు అరెస్ట్

సినీ రంగానికి చెందిన పలువురితో పాటు వ్యాపారవేత్తలని అరెస్ట్..

rakul preet singh brother: సైబరాబాద్ పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సినీ రంగానికి చెందిన ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమిన్ ప్రీత్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 35 లక్షల రూపాయల విలువ చేసే 199 గ్రాముల కొకైన్‌తో పాటు 2 పాస్‌పోర్టులు, 10 ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు.

ఒనౌహా బ్లెస్సింగ్(వెస్ట్ ఆఫ్రికా), అజీజ్ నోహీం, అల్లం సత్య వెంకట గౌతమ్, సానబోయిన వరుణ్ కుమార్, మహ్మద్ మహబూబ్ షరీఫ్ అరెస్ట్ అయ్యారు. మరో ఇద్దరు డ్రగ్ సప్లయర్లు పరారయ్యారు. నార్కోటిక్ బ్యూరో, ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన పలువురిని అరెస్ట్ చేశారు. సినీ రంగానికి చెందిన పలువురికి పాటు వ్యాపారవేత్తలు కూడా డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను అరికట్టడానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అంతగా ఫలించడం లేదు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ తామే దొరికిపోమనే ధీమాతో కొందరు వాటిని వాడుతున్నారు. డ్రగ్స్ ను నిర్మూలించడానికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సినీ ప్రముఖులను ఇటీవల కోరారు.

Also Read : క‌న్న‌డ న‌టుడు ర‌క్షిత శెట్టిపై కేసు న‌మోదు..

ట్రెండింగ్ వార్తలు