Noida : గే డేటింగ్ యాప్..నమ్మిస్తారు, అందినకాడికి దోచుకుంటారు

గే డేటింగ్ యాప్ ద్వారా పలువురిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహంగా నటిస్తూ...నమ్మకం కుదిరిన తర్వాత..ఏదో ఒక ప్రాంతానికి రప్పించి..నిలువునా మోసం చేస్తూ ఉడాయిస్తున్నారు.

Dating App : యాప్ లు, సోషల్ మీడియాను ఉపయోగించి..అందినకాడికి దోచుకుంటున్నారు. వీరిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నా..చాలా మంది మోసపోతున్నారు. తాజాగా..గే డేటింగ్ యాప్ ద్వారా పలువురిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యాప్ లో స్నేహంగా నటిస్తూ…నమ్మకం కుదిరిన తర్వాత..వారిని ఏదో ఒక ప్రాంతానికి రప్పించి..నిలువునా మోసం చేస్తూ ఉడాయిస్తున్నారు. వీరి ఆటలకు చెక్ పెట్టారు అక్కడి పోలీసులు. ఇద్దరిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది.

Read More : Molestation : వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్‌మెయిల్

జైపురియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ వద్ద నెంబర్ ప్లేట్ లేని బైక్ పై ఇద్దరు వెళుతున్నారు. వీరిపై ఎందుకో అనుమానం కలిగింది అక్కడున్న పోలీసులకు. వెంటనే ఆపాలని ఆదేశించారు. కానీ..వారు బైక్ ఆపకుండా..పోలీసులపై ఫైరింగ్ చేస్తూ..పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటే అలర్ట్ అయిన..పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఓ వ్యక్తికి బుల్లెట్ గాయం అయ్యింది. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిద్దరూ…అమిత్, దీపాన్షులుగా గుర్తించారు.

Read More : Uthra Murder Case : పాము కాటుతో భార్య మృతి.. భర్తను దోషిగా తేల్చిన కోర్టు

వీరు బదల్పూరు ప్రాంతానికి చెందిన వారుగా తెలిసింది. విచారించగా..మోసాలు బయటపడ్డాయి. గే డేటింగ్ బ్లూడ్ యాప్ పై పలువురిని ఆకట్టుకుని…వారిని లూటీ చేస్తున్నారని తేలింది. స్నాచింగ్, చోరీ వంటి నేరాలు కూడా చేసినట్లు నిర్ధారించారు. వీరి నుంచి సొత్తు, బైక్, 9 మొబైల్ ఫోన్లు, ఓ నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. యాప్ ద్వారా..నమ్మకంగా నటించి…నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి..అందినంత దోచుకుని ఉడాయించే వారని, ఇలా దాదాపు 12 మందిని మోసం చేశారని నిర్ధారించారు.

ట్రెండింగ్ వార్తలు