Professor Murders His family: ఒమిక్రాన్ భయంతో భార్య, పిల్లలను కిరాతకంగా హత్య చేసిన ప్రొఫెసర్

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయంతో ఓ ప్రొఫెసర్ తన భార్య, పిల్లలను కిరాతకంగా హత్య చేశాడు. భార్య గొంతుకోసి..పిల్లలను తలలు సుత్తితో పగుల గొట్టి చంపేశాడు.

Professor kills his family over omicron fears: ఉత్తరప్రదేశ్‌లో ప్రొఫెసర్ ఒమిక్రాన్ వేరింయట్ భయంతో అత్యంత కిరాతకానికి పాల్పడ్డాడు. ఏకంగా తన సొంత కుటుంబం అత్యంత కిరాతకంగా చంపేశాడు. భార్యను గొంతు నులిమి చంపేసిన సదరు ప్రొఫెసర్ తన ఇద్దరు పిల్లలను సుత్తితో తలలు పగుల గొట్టి మరీ హతమార్చాడు. ఈ దారుణ హత్యలపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. కాన్పూర్‌లోని కల్యాణ్‌పూర్‌కి చెందిన 55 ఏళ్ల ఫోరెన్సిక్ ప్రొఫెసర్ సుశీల్ సింగ్ కు భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. సునీల్ సింగ్ భార్య చంద్రప్రభ, పిల్లలు 21 ఏళ్ల శిఖర్ సింగ్, 16 ఏళ్ల ఖుషీ సింగ్ ఉన్నారు.సునీల్ గత కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. ఈక్రమంలో ప్రపంచంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని వార్తలు వింటున్నాడు. ఈక్రమంలో మరింత డిప్రెషన్ కు గురవుతున్నాడు.

ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్ 3,2021) మనోనిబ్బరత పూర్తిగా కోల్పోయి..తన భార్యను గొంతు కోసి చంపాడు. తరువాత తన కొడుకు, కూతుర్ని సుత్తితో వారి తలలు పగలగొట్టి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆ తరువాత తాను భార్యా పిల్లలను చంపేశానని తన సోదరుడికి వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. ‘‘చంద్రప్రభ, శిఖర్ సింగ్,ఖుషీ సింగ్ లను చంపేశాను. నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను నువ్వు పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పు’’ ఈ హత్యలకు ఎవరూ బాధ్యులు కారని… తన కుటుంబాన్ని చంపుకుంటు నన్ను నేనే నాశనం చేసుకుంటున్నానని..ఈ కరోనా వైరస్ ప్రతీ ఒక్కరిని చంపేస్తుందని..ప్రస్తుతం ఈ దారుణ పరిస్థితుల నుంచి వారిని విముక్తి చేశానని..అందుకే వారిని చంపానని రాసుకొచ్చాడు ఆ మెసేజ్‌ లో. ఆ మెసేజ్ చూసిన అతని సోదరుడు భయపడిపోయాడు. అసలే డిప్రెషన్ లో ఉన్నాడు.మెసేజ్ లో ఉన్నంత పని చేస్తాడేమోనని హడలిపోయాడు.వెంటనే సోదరుడు సుశీల్ సింగ్ కు ఫోన్ చేశాడు. కానీ అప్పటికే సుశీల్ సింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. దీంతో అతను పోలీసులకు ఫోన్ చేశాడు.

Read  more : Omicron In 38 Countries : 38 దేశాలకు పాకిన ఒమిక్రాన్..!జట్‌ స్పీడ్‌తో ప్రపంచాన్ని చుట్టేస్తోంది..!!

వృత్తి రీత్యా ఫోరెన్సిక్ ప్రొఫెసర్ అయిన సుశీల్ సింగ్ తన డైరీలో.. పలు విషయాలు రాసుకున్నాడు. ‘‘తన ప్రొఫెషన్ రీత్యా మెడికల్ కాలేజీలో కరోనాతో చనిపోయినవాళ్ల మృతదేహాలను చూసి చూసి విరక్తి వచ్చేసింది. లెక్కలేనన్ని మృతదేహాలు కుప్పలు కుప్పలుగా పడి ఉండటం చూశాను. లెక్కపెట్టలేని మృతదేహాలు చూసి నా మనస్సు చలించిపోయింది. ఇక నేను నా కుటుంబంకూడా ఇలాగే చచ్చిపోతామేమో..ఈ కరోనా ఎవ్వరిని వదిలిపెట్టదు. ఒమిక్రాన్ గా మారి ఇంకా చంపేస్తుంది. ఎవరినీ వదిలిపెట్టదని రాసుకున్నాడు. ఇప్పటికే తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని… ఒమిక్రాన్ కారణంగా ఇక తన జీవితం ముగింపుకు చేరిందనే భయం మరింత పెరిగిందని అందులో రాసుకున్నాడు.

Read more : Omicron In Rats : ఎలుకల్లో ఒమిక్రాన్‌.. ఆ తర్వాతే మనుషులకొచ్చిందా?!

ఈ హత్యలపై సుశీల్ సింగ్ సోదరుడు పోలీసులకు సమాచారం అందించడంతో… పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌కు చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రొఫెసర్ సుశీల్ సింగ్ జాడ లేదు.అతను ఎక్కడున్నాడనేది మిస్టరీగా మారింది. అతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎక్కడికైనా పారిపోయాడా? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రొఫెసర్ సుశీల్ సింగ్ కోసం మూడు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.

Read  more : Omicron Threat : కరోనా బారిన పడినవారికి..ఒమిక్రాన్ సోకదనుకుంటే పొరపాటే : పరిశోధకుల వార్నింగ్

సదరు ప్రొఫెసర్ తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్నారని..దీనికి చికిత్స కూడా తీసుకుంటున్నారని..ఈక్రమంలో ఒమిక్రాన్ సోకుతుందనే భయం పెరిగి ఈ హత్యలకు పాల్పడ్డాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. సుశీల్ సింగ్ ఇంట్లో ఉన్న డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతను రాసింది చదివి షాక్ అయ్యారు.

 

ట్రెండింగ్ వార్తలు