TSPSC AEE Exam : రద్దైన ఏఈఈ పరీక్ష తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ

పేపర్ లీకేజీ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ AEE పరీక్ష రద్దు చేసింది. గత సెప్టెంబర్ 3న AEE పరీక్ష జరిగింది. ఏఈఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.

TSPSC AEE Exam : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ AEE పరీక్ష రద్దు చేసింది. గత సెప్టెంబర్ 3న AEE పరీక్ష జరిగింది. ఏఈఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది. రద్దైన పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ మేరకు రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలను ప్రకటించింది. మే8,9,21 తేదీల్లో AEE పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.

మే8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పోస్టులకు, 9న అగ్రికల్చర్, మెకానికల్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. మే21న సివిల్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, మెకానిక్ పోస్టులకు ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహించనున్నారు. సివిల్ పోస్టులకు ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష జరుగనుంది. మరిన్ని వివరాల కోసం టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ ను చూడవచ్చు.
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పేపర్ ప్రశ్నా పత్రం లీకేజీ వ్యవహారం కలకలం రేపింది.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరు అరెస్టు.. ప్రశ్నాపత్రం కొనుగోలుకు రూ.10 లక్షల ఒప్పందం

దీంతో అంతకముందు నిర్వహించిన పరీక్షలు, నిర్వహించబోయే పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా లీక్ అయ్యాయేమో అన్న అనుమానంతో ఆయా నియమాక పరీక్షలను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది.  మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

నిందితులను కీలక అంశాలను సిట్ రాబడుతోంది. పలువురు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. నిందితుల కస్టడీ విచారణలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తీగ లాగితే డొంక కదిలిన చందంగా అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలన వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు