Agniveer Exam Admit Cards : అగ్నివీర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డుల విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

Agniveer Exam Admit Cards : అగ్ని పథ్ స్కామ్ కింద అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం భారత ఆర్మీ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Agniveer Exam Admit Cards : ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (CEE) ఫేజ్ -1 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయొచ్చు. ఈ పరీక్ష ఏప్రిల్ 22 నుంచి మే 3, 2024 వరకు జరుగుతుంది.

Read Also : CBSE Open Book Exams : పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయొచ్చుంటున్న సీబీఎస్ఈ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన!

అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీర్స్ రిక్రూట్‌మెంట్ కోసం భారత ఆర్బీ గతంలో ఆన్‌లైన్ దరఖాస్తును ఆహ్వానించింది. అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD), అగ్నివీర్ ఎస్‌కెటి / క్లర్క్, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT)గా పిలిచే ఫేజ్-1 రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ఇండియన్ ఆర్మీ నిర్వహించనుంది. అగ్నివీర్ కోసం పీఎఫ్‌టీ పరీక్ష అన్ని ప్రాంతాలకు లేదా జెడ్ఆర్ఓ (జోనల్ రిక్రూట్‌మెంట్ ఆఫీస్) కోసం వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో సాధారణ ప్రవేశ పరీక్షను భారత ఆర్మీ నిర్వహిస్తుంది. భారత్ అంతటా 25వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి.

అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేయాలంటే? :

  • ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
  • ఆర్మీ అగ్నివీర్ అడ్మిట్ కార్డ్ 2024 డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి
  • యూజర్ పేరు, పాస్‌వర్డ్ వంటి అభ్యర్థి వివరాలతో లాగిన్ చేయండి
  • ఆర్మీ అగ్నివీర్ అడ్మిట్ కార్డ్ 2024ని డౌన్‌లోడ్ చేసుకోండి
  • అడ్మిట్ కార్డ్ ప్రింటవుట్ తీసుకోండి.

ఇండియన్ ఆర్మీలో అగ్నిపథ్ స్కీమ్ 17.5 నుంచి 21ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులకు అర్హత ఉంటుంది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు నాలుగేళ్లపాటు అగ్నివీరుడుగా సేవలందించే అవకాశం ఉంటుంది.

Read Also : CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?

ట్రెండింగ్ వార్తలు