CUET PG 2024 Result Out: Check Highest Marks In Major Subjects
CUET PG 2024 Result Out : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-PG) 2024 ఫలితాలను ప్రకటించింది. ఈ స్కోర్లతో పాటు ఎన్టీఏ సీయూఈటీ-PG 2024లో మొత్తం 157 సబ్జెక్టులకు సబ్జెక్ట్ వారీగా టాపర్లను కూడా రిలీజ్ చేసింది. సీయూఈటీ-పీజీ వెబ్సైట్లో ప్రతి సబ్జెక్ట్‌లో అత్యధిక మార్కులను చెక్ చేయవచ్చు. సీయూఈటీ-పీజీ 2024లో కొన్ని ప్రధాన సబ్జెక్టులలో అత్యధిక మార్కులు సాధించారు.
మొత్తం 190 యూనివర్శిటీలు సీయూఈటీ (పీజీ) 2024 స్కోర్ల ఆధారంగా అడ్మిషన్‌ను అందిస్తాయి. ఇందులో దాదాపు 39 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 15 ప్రభుత్వ సంస్థలు, 30 రాష్ట్ర ప్రభుత్వ యూనివర్శిటీలు, 97 ఇతర, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్శిటీలు ఉన్నాయి. సీయూఈటీ స్కోర్ల ఆధారంగా ప్రవేశాలను నిర్వహించే యూనివర్శిటీల పూర్తి జాబితాను సీయూఈటీ 2024 అధికారిక వెబ్సైట్లో చెక్ చేయవచ్చు.
Read Also : Agniveer Exam Admit Cards : అగ్నివీర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డుల విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి!