Karnataka Twin Sisters : కర్ణాటక ట్విన్ సిస్టర్స్.. పోలికల్లోనే కాదు.. 10, 12 తరగతి పరీక్షల్లో కూడా ఒకేలా మార్కులు..!

రెండు సంవత్సరాల క్రితం.. 10వ తరగతి (SSLC) పరీక్షలలోనూ కవల అక్కాచెల్లెళ్లు (620/625) ఒకే మార్కులు సాధించారు. ఇప్పుడు 12వ తరగతి పరీక్షలోకూడా (571/600) సాధించి తామిద్దరం పోలికల్లోనే కాదు... చదువులోనూ ఒకటేనని నిరూపించారు.

Karnataka Twin Sisters : కవలలు.. సాధారణంగా చూసేందుకు అందరికి ఒకేలా కనిపిస్తారు.. వారి ఆలోచనలు, చేసే పనులు దాదాపు ఒకేలా ఉంటాయి. బయటివారు అయితే కవలలను వేరుగా గుర్తుపట్టడం కష్టమే.. అలాంటి కర్ణాటకలోని హాసన్‌కు చెందిన ట్విన్ సిస్టర్స్ ఇప్పుడు అద్భుతమైన ప్రతిభను కనబర్చారు. చుక్కీ, ఇబ్బాని చంద్ర కెవీ కవల అక్కాచెల్లెళ్లు.. తమ పోలికల్లోనే కాదు.. పరీక్షల్లోనూ ఒకేలా మార్కులు సాధించి అందరిని అబ్బురపరిచారు. కేవలం రెండు నిమిషాల తేడాతో వీరిద్దరూ జన్మించారు.

Read Also : CBSE Open Book Exams : పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయొచ్చుంటున్న సీబీఎస్ఈ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన!

ఇంటర్‌లోనే కాదు.. 10వ తరగతిలోనూ మార్కులు సమానమే :
కానీ, పరీక్ష ఫలితాల్లో మాత్రం కొంచెం కూడా తేడా లేకుండా సమానంగా మార్కులు తెచ్చుకున్నారు. చుక్కీ, ఇబ్బాని 12వ తరగతి పీయూసీ పరీక్షా ఫలితాల్లో (571/600) కచ్చితమైన మార్కులు సాధించి అత్యంత అరుదైన ఘనతను సాధించారు. కర్ణాటకలో ఇటీవల 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కాగా.. అందులో వీరిద్దరికి సమానంగా మార్కులు తెచ్చుకున్నారు. అంతేకాదు.. రెండు సంవత్సరాల క్రితం.. 10వ తరగతి (SSLC) పరీక్షలలోనూ కవల అక్కాచెల్లెళ్లు (620/625) ఒకే మార్కులు సాధించారు. దాంతో తామిద్దరం ముఖ కవళికల్లోనే కాదు… చదువులోనూ ఒకటేనని నిరూపించారు.

ఈ సందర్భంగా కవలల్లో పెద్ద అమ్మాయి చుక్కి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది నిజంగా యాదృచ్చికమే. మా ఇద్దరికి ఒకేలా మార్కులు ఎలా వచ్చాయో తెలీదు. మేమిద్దరం 97 శాతం ప్లస్ మార్కులు వస్తాయని భావించాం. మాకు వచ్చిన దానికంటే కొంచెం ఎక్కువ. కానీ, చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే.. మా ఇద్దరికీ కచ్చితమైన శాతం వచ్చింది”అని చెప్పుకొచ్చింది.

నీట్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న ట్విన్ సిస్టర్స్ : 
అంతేకాదు.. ఇప్పుడు తాము నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నామని చుక్కీ తెలిపింది. తన సోదరి ఇబ్బానితో కలిసి నీట్‌లో మంచి ర్యాంకు సాధించాలని కోరుకుంటున్నామని ఇబ్బాని పేర్కొంది. నీట్ ర్యాంకు ఆధారంగా మెడిసిన్ లేదా ఇంజనీరింగ్‌ని ఎంచుకోవాలని భావిస్తున్నామని, మా ఇద్దరికీ ఒకే ఆశయం ఉందని, సంగీతం, నృత్యం, క్రీడలపై కూడా ఆసక్తి ఉందని కవల అక్కాచెల్లెళ్లు చెప్పుకొచ్చారు.

కవలలు హాసన్‌లోని ఎన్‌డీఆర్‌కే పీయూ కాలేజీలో సైన్స్ స్ట్రీమ్‌లో చేరారు. మెడిసిన్ లేదా ఇంజినీరింగ్ ఏ రంగంపై ఆసక్తి ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు.. చుక్కీ ఇలా సమాధానమిచ్చింది..“నేను ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు. నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని మా ఇద్దరికీ తెలుసు. మా ప్రయత్నాలు ఆ దిశగానే కొనసాగుతున్నాయి’’ అని తెలిపింది. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారా అని అడగ్గా.. “నా కన్నా మా అక్క ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే.. నేను చాలా సంతోషిస్తాను. నేను కూడా అంతే. మాలో మాకు ఏ పోటీ లేదు”అని ఇబ్బని చెప్పింది.

లాంగ్వేజీల్లో ఎక్కువ స్కోరు చేసిన ఇబ్బనీ :
కవల అక్కాచెల్లెళ్ల తండ్రి వినోద్ చంద్ర కూడా తమ పిల్లలు ఇద్దరూ ఒకేలా మార్కులు సాధించడం చూసి చాలా ఆశ్చర్యపోయారు. తన కుమార్తెల ప్రతిభ పట్ల చాలా గర్వంగా ఉందన్నారు. ఇద్దరి తుది స్కోర్ ఎలా ఒకేలా ఉండవచ్చో.. వివిధ సబ్జెక్టుల్లో వారి మార్కులు మారుతూ ఉంటాయని ఆయన అన్నారు. ఇబ్బానీ తన సోదరి కన్నా లాంగ్వేజీ సబ్జెక్టుల్లో మెరుగ్గా స్కోర్ చేసింది. అయితే, వారిద్దరూ ఇతర సైన్స్ సబ్జెక్టులలో ఒకటి నుంచి రెండు మార్కుల తేడాతో ఉన్నారని తండ్రి చెప్పుకొచ్చాడు.

‘ఇద్దరూ పరీక్ష కోసం చాలా కష్టపడ్డారు. అయినప్పటికీ వారు 2 నుంచి 3 శాతం ఎక్కువ మార్కులను ఆశించారని మాకు తెలుసు. వాళ్ళు కలిసి పనులు చేసుకుంటారు. ఒకరికొకరు ఆనందిస్తారు. బుద్ధిగా చదువుకుంటారు. అంతమాత్రానా వారిని పుస్తకాల పురుగులు అని అనలేం కదా’ అని తండ్రి చంద్ర నవ్వుతూ అన్నారు.

Read Also : CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?

ట్రెండింగ్ వార్తలు