Thangalaan Release: ఆగస్టు 15న తంగలాన్‌ మాత్రమే రిలీజ్‌? ఇతర సినిమాల విడుదలకు బ్రేక్‌?

ఇతర భాషా చిత్రాలు విడుదల చేయకూడదని నిర్ణయించడంతో తంగలాన్‌పై క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయిందంటున్నారు

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. ఆగస్టు 15న వరల్డ్ వైడ్‌గా రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా కోసం కోలీవుడ్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుందట.. ఇప్పటివరకు భారతీయ సినీ రంగంలో ఏ చిత్ర పరిశ్రమ తీసుకోని ఆ నిర్ణయం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌ అవుతోంది. ఒక సినిమా కోసం కోలీవుడ్‌ మొత్తం ఏకమవడం ఇందులో ప్రత్యేకతగా చెబుతున్నారు. ఇంతకీ తంగలాన్‌ కోసం కోలీవుడ్‌ తీసుకున్న నిర్ణయమేంటో చూసేద్దాం పదండి.

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన పాన్ ఇండియన్ ఫిల్మ్ తంగలాన్. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. విక్రమ్‌కు ఆపోజిట్‌గా మాళవిక మోహనన్ నటించింది. అయితే ఈ పీరియాడిక్ మూవీ గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోలీవుడ్‌లో సంచలనమవుతోంది. ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం తమిళనాడు ఫిల్మ్ ఇండ్రిస్ట్రీ పెద్దలంతా కీలక నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఆ రోజు తమిళనాడు మొత్తం అన్ని థియేటర్లో తంగలాన్ సినిమా మాత్రమే ప్రదర్శించాలన్నదే ఆ నిర్ణయం…

సినిమా టికెట్ట ధరలు కూడా నార్మల్
తంగలాన్‌ కాకుండా మరే ఇతర సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చెయ్యవద్దని కోలీవుడ్‌ నిర్మాతలు తీసుకున్న నిర్ణయం హాట్‌టాపిక్‌గా మారింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన యదార్థ సంఘటనలను ఈ సినిమాలో చూపించబోతున్నారు చిత్ర యూనిట్. అంతేకాదు సినిమా టికెట్ట ధరలు కూడా నార్మల్ గానే వుంచాలని నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఆగస్టు 15న తమిళనాడులో మరే ఇతర తమిళ్, ఇతర భాషా చిత్రాలు విడుదల చేయకూడదని నిర్ణయించడంతో తంగలాన్‌పై క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయిందంటున్నారు. ఇక ఈ సినిమాను నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. జ్నానవేల్ రాజ్ నిర్మాత.

Also Read : బాబోయ్.. రకుల్ ప్రీత్ సింగ్ ఎక్సర్‌సైజ్ చూడండి.. ఒక్క కాలు మీద ఎంత బరువు మోస్తుందో.. 

ట్రెండింగ్ వార్తలు