Rakul Preet Singh : బాబోయ్.. రకుల్ ప్రీత్ సింగ్ ఎక్సర్‌సైజ్ చూడండి.. ఒక్క కాలు మీద ఎంత బరువు మోస్తుందో..

తాజాగా రకుల్ తన జిమ్ వీడియో ఒకటి పోస్ట్ చేసింది.

Rakul Preet Singh : బాబోయ్.. రకుల్ ప్రీత్ సింగ్ ఎక్సర్‌సైజ్ చూడండి.. ఒక్క కాలు మీద ఎంత బరువు మోస్తుందో..

Rakul Preet Singh Shares Heavy Workouts Gym Video

Updated On : July 26, 2024 / 8:55 PM IST

Rakul Preet Singh : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి అనంతరం బాలీవుడ్ కి చెక్కేసింది రకుల్ ప్రీత్ సింగ్. అక్కడ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. బాలీవుడ్ లో నిర్మాత జాకీ భగ్నానీతో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపి ఇటీవలే పెళ్లి కూడా చేసుకుంది. ఓ పక్కన మ్యారేజి లైఫ్ గడుపుతునే మరో పక్క సినిమాలు కూడా చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్.

ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది రకుల్. హీరోయిన్స్ అంతా తమ బాడీని మెయింటైన్ చేయడానికి జిమ్ లో చాలానే కష్టపడతారు. రకుల్ కూడా జిమ్ లో బాగానే కష్టపడుతుంది. రకుల్ కి జిమ్ బిజినెస్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రకుల్ తన జిమ్ వీడియో ఒకటి పోస్ట్ చేసింది.

Also Read : Manchu Vishnu : మంచు విష్ణు మరీ ఇలా చేస్తున్నాడా? దారుణంగా తిట్టిన యూట్యూబర్..

అయితే ఇందులో ఒంటి చేత్తో పడుకొని ఒక కాలు టేబుల్ పై పెట్టి ఇంకో కాలు మీద వెయిట్ పెట్టుకొని పైకి లేపింది. చాలా కష్టపడుతూనే ఈ వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంది రకుల్. దీంతో ఈ వీడియో చూసి రకుల్ అలా ఎలా మోస్తుంది, పాపం బాగానే కష్టపడుతుంది అని ఆశ్చర్యపోతూనే కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరో వీడియోలో తన మజిల్స్ చూపిస్తూ వర్కౌట్ వీడియో షేర్ చేసింది. మీరు కూడా రకుల్ జిమ్ వీడియో చూసేయండి..

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)