Manchu Vishnu : మంచు విష్ణు మరీ ఇలా చేస్తున్నాడా? దారుణంగా తిట్టిన యూట్యూబర్..

మా అసోసియేషన్ తరపున మంచు విష్ణు నటీనటులపై ట్రోల్స్ చేస్తున్నారని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని మూయించిన సంగతి తెలిసిందే.

Manchu Vishnu : మంచు విష్ణు మరీ ఇలా చేస్తున్నాడా? దారుణంగా తిట్టిన యూట్యూబర్..

Youtuber Fires on Manchu Vishnu Regarding Channels Block Issue Video goes Viral

Manchu Vishnu : ఇటీవల మా అసోసియేషన్ తరపున మంచు విష్ణు నటీనటులపై ట్రోల్స్ చేస్తున్నారని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని మూయించిన సంగతి తెలిసిందే. కొన్ని సైబర్ టీమ్ సహాయంతో కొన్ని తమ కంటెంట్ వాడినందుకు ఛానల్స్ పై స్ట్రైక్స్ వేసి మూయించేసాడు. అయితే ఇవన్నీ కూడా నటీనటులపై నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారనే ఆ యూట్యూబ్ ఛానల్స్ అని మూయించాడు.

కానీ తాజాగా ఓ యూట్యూబర్ మంచు విష్ణు చేస్తున్న పనిపై దారుణమైన విమర్శలు చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతుంది. మామూలుగానే మంచు ఫ్యామిలీ, వాళ్ళు మాట్లాడే మాటలపై ట్రోల్స్ చేస్తారని తెలిసిందే. ఇటీవల మంచు విష్ణు తీస్తున్న కన్నప్ప సినిమా టీజర్ కూడా వచ్చింది. అయితే టీజర్ లో ఉన్న తప్పులని ట్రోల్ చేస్తూ పలువురు వీడియోలు చేసారు. సోషల్ మీడియాలో కూడా కన్నప్ప టీజర్ నెగిటివ్ గా బాగా వైరల్ అయింది. మంచి సినిమాని చెడగొడుతున్నావని విమర్శలు కూడా చేసారు.

Also Read : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన నటుడు కృష్ణుడు భార్య.. ప్రభాస్ పెళ్లి బట్టలు ఇక్కడే కొంటాను.. ప్రభాస్ పెద్దమ్మ..

అయితే మంచు విష్ణు ఇన్నాళ్లు బ్లాక్ చేయించిన యూట్యూబ్ ఛానల్స్ నటీనటులపై ట్రోల్స్ చేసినవి కాదని.. మంచు ఫ్యామిలీని, కన్నప్ప సినిమాని ట్రోల్ చేసిన ఛానల్స్ అని ఓ యూట్యూబర్ వీడియో చేసాడు. ఆ యూట్యూబర్ మంచు విష్ణుపై దారుణమైన విమర్శలు చేస్తూ.. కన్నప్ప గురించి ట్రోల్స్ వేసినందుకు యూట్యూబ్ ఛానల్స్ ని బ్లాక్ చేసాడు. చెప్పినవి 18 అయినా అనధికారికంగా చాలా ఛానల్స్ బ్లాక్ చేసాడు. ఎవ్వరి ఫ్యామిలీలను మేము ట్రోల్ చెయ్యట్లేదు. నిన్నే ట్రోల్ చేస్తున్నామంటే నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి. మా అసోసియేషన్ ని ఇలా వాడుకుంటున్నావు అంటూ మాట్లాడాడు. ఛానల్స్ బ్లాక్ చేసిన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కన్నప్ప గురించి పాజిటివ్ గా వీడియోలు చేస్తే ఛానల్స్ పై వేసిన స్ట్రైక్స్ తీయిస్తామని కూడా మెయిల్స్ చేసినట్టు వ్యాఖ్యానించాడు. దీంతో ఈ యూట్యూబర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి మంచు విష్ణుని పలువురు విమర్శిస్తున్నారు.

అయితే ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టగా అక్కడ కూడా వీడియోకి స్ట్రైక్ వేసి తీయించాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మంచు విష్ణు పై విమర్శలు వస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమనేది ఆ యూట్యూబ్ ఛానల్స్ కి, మంచు విష్ణు కే తెలియాలి. అయితే దీనిపై మంచు విష్ణు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నుంచి స్పందిస్తూ.. మా సంస్థ నుంచి మెయిల్స్ వచ్చినట్టు కొంతమంది ఫేక్ మెయిల్ ఐడిలతో మా సంస్థపై, కన్నప్ప సినిమాపై నెగిటివ్ ప్రమోషన్ చేస్తున్నారు. దీనిపై సైబర్ కంప్లైంట్ ఇస్తాము. మంచు విష్ణుపై కొంతమంది కావాలని ఇలా అనెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు అని నోటిస్ విడుదల చేసారు.