కొత్త బిజినెస్ మొదలుపెట్టిన నటుడు కృష్ణుడు భార్య.. ప్రభాస్ పెళ్లి బట్టలు ఇక్కడే కొంటాను.. ప్రభాస్ పెద్దమ్మ..

నటుడు కృష్ణుడు భార్య గాయత్రి మరొకరితో కలిసి శారీ బిజినెస్ మొదలుపెట్టింది.

కొత్త బిజినెస్ మొదలుపెట్టిన నటుడు కృష్ణుడు భార్య.. ప్రభాస్ పెళ్లి బట్టలు ఇక్కడే కొంటాను.. ప్రభాస్ పెద్దమ్మ..

Actor Krishnudu Wife Gayatri Starting New Business Opened by Prabhas Aunty Syamala Devi

Updated On : July 26, 2024 / 6:39 PM IST

Shyamala Devi – Krishnudu Wife : వినాయకుడు, హ్యాపీడేస్.. లాంటి పలు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన కృష్ణుడు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే నటుడు కృష్ణుడు భార్య గాయత్రి మరొకరితో కలిసి శారీ బిజినెస్ మొదలుపెట్టింది. అభిలాష రెడ్డి, గాయత్రి కలిసి జరివరం అనే శారీ షాప్ ఓపెన్ చేసారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఈ షాప్ ని తాజాగా ప్రారంభించారు.

అయితే ఈ షాప్ ఓపెనింగ్ కి ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి, హీరో రక్షిత్ అట్లూరి, హైద్రాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి మాట్లాడుతూ.. జరివరం స్టోర్ కు నన్ను గెస్ట్ గా ఆహ్వానించడం చాలా హ్యాపీ గా ఉంది. నాకు పర్సనల్ గా కంచి పట్టు చీరలు ఇష్టం. ఇక్కడ ఆ కలెక్షన్స్ బాగున్నాయి. కృష్ణంరాజు గారు నాకు కొన్న ఫస్ట్ చీర కంచి పట్టు చీరనే. ప్రభాస్ పెళ్ళి బట్టలు కూడా ఈ జరివరం నుండే కొంటాను అని అన్నారు.

Also Read : Sai Dharam Tej : యాక్సిడెంట్ ముందు ఇచ్చిన మాట.. గుర్తుపెట్టుకొని నెరవేర్చిన మెగా హీరో.. పావలా శ్యామల కోసం..

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఇక్కడ కలెక్షన్స్ బాగున్నాయి. లేడీస్ కి ఇక్కడి కలెక్షన్స్ నచ్చుతాయి. మ్యారేజ్ డ్రెస్ లే కాకుండా ఫాన్సీ డ్రెస్సులు కూడా ఉన్నాయి. కావలసినట్టు తయారు చేసి ఇస్తున్నారు వీళ్ళు అని తెలిపారు.

నటుడు కృష్ణుడు మాట్లాడుతూ.. అభిలాష రెడ్డి గారు, మా వైఫ్ గాయత్రి కలసి ఈ స్టార్ స్టార్ట్ చేశారు. ఈ కలెక్షన్స్ వాళ్ళు చాలానే కష్టపడ్డారు. హైద్రాబాద్ లో మహిళలకు మంచి కలెక్షన్స్ ఇవ్వాలి అనే ఈ జరివరం మొదలుపెట్టారు, అక్కడకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. ఇక అభిలాష రెడ్డి, కృష్ణుడు వైఫ్ గాయత్రి మాట్లాడుతూ.. కస్టమర్స్ కి మంచి కలెక్షన్స్ ఇవ్వాలని చాలా నెలలు హామ్ వర్క్ చేసి ఈ జరివరం మొదలుపెట్టామని తెలిపారు.