Sai Dharam Tej : యాక్సిడెంట్ ముందు ఇచ్చిన మాట.. గుర్తుపెట్టుకొని నెరవేర్చిన మెగా హీరో.. పావలా శ్యామల కోసం..

తాజాగా సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ముందు ఆమెకు సాయం చేస్తానన్న మాట గుర్తుంచుకొని ఇప్పుడు ఆమెకు ఆర్ధిక సహాయం చేసారు.

Sai Dharam Tej : యాక్సిడెంట్ ముందు ఇచ్చిన మాట.. గుర్తుపెట్టుకొని నెరవేర్చిన మెగా హీరో.. పావలా శ్యామల కోసం..

Sai Dharam Tej Financial Help To Pavala Syamala Emotional Video goes Viral

Updated On : July 26, 2024 / 6:58 PM IST

Sai Dharam Tej – Pavala Syamala : మన సెలబ్రిటీలు అప్పుడప్పుడు పలువురికి సాయం చేసి తమ మంచి మనసుని చాటుకుంటారు. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ముందు ఇచ్చిన మాట గుర్తుంచుకొని ఇప్పుడు సీనియర్ నటి పావలా శ్యామలకు ఆర్ధిక సహాయం అందించారు. ఒకప్పుడు కమెడియన్ గా చేతినిండా సినిమాలతో బిజీ లైఫ్ చూసిన నటి పావలా శ్యామల ప్రస్తుతం వయసు సహకరించకపోవడంతో, అనారోగ్యంతో సినిమాలకు దూరమయింది.

పావలా శ్యామలతో పాటు తన కూతురి ఆరోగ్యం కూడా పాడవడంతో ఆ కుటుంబం దీనస్థితిలో ఉన్నారు. ఈ విషయం తెలిసి గతంలో చిరంజీవి, జీవన్ కుమార్, కాదంబరి కిరణ్.. పలువురు నటులు ఆమెకు ఆర్ధిక సహాయం చేసారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ముందు ఆమెకు సాయం చేస్తానన్న మాట గుర్తుంచుకొని ఇప్పుడు ఆమెకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చేసారు.

Also Read : Purushothamudu : ‘పురుషోత్తముడు’ మూవీ రివ్యూ.. రాజ్ తరుణ్ సినిమా ఎలా ఉంది?

తెలుగు ఫిలిం జర్నలిస్ట్ లు పలువురు పావలా శ్యామల వద్దకు వెళ్లి సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన క్యాష్ ని అందించారు. అలాగే సాయి ధరమ్ తేజ్ పావలా శ్యామలతో వీడియో కాల్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా పావలా శ్యామల మాట్లాడుతూ.. మీకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మీరు కోలుకోవాలని దండం పెట్టుకున్నాను. గతంలో చిరంజీవి గారు కూడా సహాయం చేసారు. మా పరిస్థితి బాగోలేదు చచ్చిపోదామనుకున్నాము. దేవుడిలా వచ్చి మాకు సహాయం చేసావు అని ఏడ్చేసింది. దీంతో పావలా శ్యామల మాటలకు సాయి ధరమ్ తేజ్ కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ పావలా శ్యామలతో వీడియో కాల్ మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. ఈ విషయంలో మరోసారి తేజ్ ని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు. అలాగే సాయి ధరమ్ తేజ్ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కు 5 లక్షల ఆర్ధిక సహాయం చేసారు.

 

Sai Dharam Tej Financial Help To Pavala Syamala Emotional Video goes Viral