CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?

CBSE Boards Exam 2024 : సీబీఎస్ఈ పరీక్షలు దగ్గరపడుతున్నాయి. విద్యార్థులు పరీక్షల కోసం ప్రిపరేషన్ మొదలుపెడుతున్నారు. ఈ సమయంలో సాధారణంగా విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి సీబీఎస్ఈ చక్కని టిప్స్ అందిస్తోంది.

CBSE Boards Exam 2024 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (CBSE) పరీక్షల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అనుసరించాల్సినవి, కొన్ని చేయకూడని పనుల జాబితాను వెల్లడించింది. పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతుంటారు.

Read Also : CBSE Board Exams : టెన్త్, ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు..!

పరీక్షా సమయం అనేది చాలా సాధారణమైన పరిస్థితిగా సీబీఎస్ఈ సూచిస్తోంది. కష్టతరమైన పరీక్షల కోసం విద్యార్థులు సిద్ధమవుతున్న సమయంలో కొన్ని వ్యూహాలను అనుసరించడం వల్ల పరీక్షలో మంచి ఫలితాలను సాధించడానికి తల్లిదండ్రులు సాయపడవచ్చునని పేర్కొంది. అదేవిధంగా, ఆందోళన, ఒత్తిడిని అధిగమించడంలో విద్యార్థులకు సాయపడే వ్యూహాలు, అవసరమైన విధానాన్ని సీబీఎస్ఈ బోర్డు షేర్ చేసింది.

విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు చేయాల్సినవి.. చేయకూడనివి ఇవే :

  • విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమైతే బాగా రాణించలేరు.
  • తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రణాళిక, మేనేజ్‌మెంట్ టైమ్-టేబుల్ సెట్ చేసుకోవడంలో మార్గనిర్దేశం చేయాలి.
  • పిల్లల ఒత్తిడి పరిస్థితిని నివారించడానికి, తల్లిదండ్రులు సరైన ప్రేరణ కలిగించాలి. అందుకోసం సానుకూల వాతావరణాన్ని కల్పించాలి.
  • పిల్లలు తక్కువ మార్కులు లేదా గ్రేడ్‌ల కారణంగా నిరుత్సాహపడితే వారిలో విశ్వాసాన్ని పెంచేలా తల్లిదండ్రులు తప్పనిసరిగా వారిలో విశ్వాసాన్ని పెంచాలి.
  • విద్యార్థులు బాగా చదివినప్పుడు మెచ్చుకంటే సరిపోదు.. మీరు బాగా చదివారు.. ఇంకా బాగా చేయగలరంటూ పాజిటివ్ విషయాలను చెప్పి ప్రోత్సహించాలి.
  • విద్యార్థులు ఒత్తిడిని తగ్గించేలా ఫన్నీగా మాట్లాడాలి. తల్లిదండ్రులు పిల్లలతో ఫ్రెండ్లీగా మెలగాలి
  • పిల్లల విశ్వాసాన్ని పెంచడానికి వారి సమస్యలను అడిగి చర్చించడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలి.
  • పరిష్కారం కనుగొనడంలో విద్యార్థులకు అవసరమైన సహాయం చేయాలి.

విద్యార్థులు చేయాల్సిన పనులివే :

  • మీ ఏకాగ్రత పరిధిని తెలుసుకోండి. మధ్యలో కొద్ది సమయం విరామం ఇస్తూ పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి.
  • విద్యార్థులు ఏకాగ్రత కోసం మంచి సమయాన్ని ఎంచుకోవాలి.
  • కష్టతరమైన సబ్జెక్టుల కోసం ఇతర విద్యార్థులతో గ్రూప్ స్టడీ తప్పనిసరిగా ఉండాలి.
  • విద్యార్థులు ప్రతికూల ఫలితాలతో నిరుత్సాహపడకూడదు.
  • గత పరీక్షల్లో తప్పిదాలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నించాలి.
  • విద్యార్థులు తప్పనిసరిగా అన్ని సబ్జెక్టులకు టైమ్‌ మేనేజ్‌మెంట్ ప్లాన్ రూపొందించుకోవాలి.
  • పరీక్షల సమయంలో అనేక అంశాలను నేర్చుకుంటారు.
  • అయితే, వాటిని మరిచిపోకుండా ఉండేందుకు మళ్లీ రివిజన్ చేయాలి.
  • పరీక్ష సమయలో తొందరగా గుర్తించడానికి సులభంగా ఉంటుంది.
  • రివిజన్ చేయనివి వెంటనే మరచిపోయే అవకాశం ఉంటుంది.
  • విద్యార్థులు తప్పనిసరిగా టైమ్‌టేబుల్‌ను రూపొందించుకోవాలి.
  • తద్వారా రివిజన్ టైమ్ ప్లాన్ చేసుకోవాలి.
  • మీ టైమ్‌టేబుల్‌లో రిలీఫ్ కోసం గేమ్స్, వాకింగ్, టీవీ చూడటం వంటివి కూడా ఉండాలి.

Read Also : CBSE Open Book Exams : పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయొచ్చుంటున్న సీబీఎస్ఈ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన!

ట్రెండింగ్ వార్తలు