NEET-UG Final Results : నీట్ యూజీ ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి..!

NEET-UG Final Results : ఈ నీట్ పరీక్షకు సంబంధించి ఫైనల్ రివైజ్డ్‌ ఆన్సర్‌ కీని కూడా రిలీజ్ చేసింది. విద్యార్థులు రివైడ్డ్‌ రిజల్స్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో, రివైజ్డ్‌ కీని చెక్ చేసుకోవచ్చు.

NEET-UG Final Results ( Image Source : Google )

NEET-UG Final Results : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం (జూలై 26)న వివాదాస్పదమైన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీ తుది ఫలితాలను ప్రకటించిందని అధికారులు వెల్లడించారు. ఎన్టీఏ చెప్పిన ఫిజిక్స్ ప్రశ్నకు సంబంధించిన మార్కులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్ ఫలితాలు ప్రకటించారు.

Read Also : Karnataka NEET Exam : CET ట్రాక్ రికార్డు బాగుంది.. ఇకపై ‘ఉమ్మడి పరీక్ష’ మేమే నిర్వహిస్తాం.. నీట్‌‌పై కర్ణాటక అసెంబ్లీ తీర్మానం!

రీవైజ్ చేసిన స్కోర్ కార్డ్‌లు ఇప్పుడు అప్‌డేట్ అయ్యాయని సీనియర్ ఎన్టీఏ అధికారి తెలిపారు. అంతకుముందు టాపర్లుగా ప్రకటించిన 67 మంది అభ్యర్థులలో 44 మంది నిర్దిష్ట ఫిజిక్స్ ప్రశ్నకు ఇచ్చిన మార్కుల కారణంగా పూర్తి మార్కులు సాధించారు. కొన్ని పరీక్షా కేంద్రాలలో 6 అభ్యర్థులకు గ్రేస్ మార్కులను ఏజెన్సీ విత్‌డ్రా చేసుకోవడంతో టాపర్ల సంఖ్య తరువాత 61కి తగ్గింది.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి :
ఈ నీట్ పరీక్షకు సంబంధించి ఫైనల్ రివైజ్డ్‌ ఆన్సర్‌ కీని కూడా రిలీజ్ చేసింది. విద్యార్థులు రివైడ్డ్‌ రిజల్స్ట్ (exams.nta.ac.in/NEET) వెబ్‌సైట్‌లో, రివైజ్డ్‌ కీని https://nta.ac.in/ వెబ్‌సైట్‌‌లో చెక్ చేసుకోవచ్చు. రివైజ్డ్ ఫలితాల్లో ఈసారి 17 మందికే ఫస్ట్ ర్యాంకు వచ్చింది. 2024 ఏడాది మే 5న జరిగిన నీట్-యూజీ పరీక్షను మొత్తం 24,06,079 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 10,29,154 మంది అబ్బాయిలు ఉండగా, 13,76,831 మంది అమ్మాయిలు, 18 మంది థర్డ్ జెండర్ అభ్యర్థులు ఉన్నారు.

నీట్ యూజీ 2024 పాస్ కాని అభ్యర్థులకు పెద్ద ఎదురుదెబ్బ కాగా, వివాదాస్పద పరీక్షను రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుతూ దాఖలైన అభ్యర్ధనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అది “విటియేటెడ్” అని నిర్ధారించేలా రికార్డులో ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది.

మే 5న జరిగిన ప్రతిష్టాత్మక పరీక్ష నీట్-యుజి 2024లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఇప్పటికే 6 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర సంబంధిత కోర్సులలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నీట్ యూజీ నిర్వహిస్తారు.

Read Also : UPSC Exam System : యూపీఎస్సీ కీలక నిర్ణయం.. కొత్త టెక్నాలజీతో పరీక్షా విధానం.. మోసాలకు చెక్ పడినట్టే..!

ట్రెండింగ్ వార్తలు