UPSC Exam System : యూపీఎస్సీ కీలక నిర్ణయం.. కొత్త టెక్నాలజీతో పరీక్షా విధానం.. మోసాలకు చెక్ పడినట్టే..!

UPSC Exam System : అభ్యర్థుల కోసం అత్యాధునిక ఆధార్ ఆధారిత ఫింగర్ ఫ్రింట్ అథెంటికేషన్, ఫేస్ రికగ్నైజేషన్ పొందుపరచాలని కమిషన్ యోచిస్తోంది. అధునాతన డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది. 

UPSC Exam System : యూపీఎస్సీ కీలక నిర్ణయం.. కొత్త టెక్నాలజీతో పరీక్షా విధానం.. మోసాలకు చెక్ పడినట్టే..!

UPSC to revamp its exam system with new technology ( Image Source : Google )

UPSC Exam System : దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ వ్యవహారం సంచ‌ల‌నం రేకిత్తించంది. పరీక్షా నిర్వహణ విధానంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) యూపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష విధానానికి సంబంధించి కీల‌క మార్పులకు యూపీఎస్సీ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇటీవలి ప్రభుత్వ పరీక్షలలో మోసం, కేసుల మధ్య పరీక్షా విధానాన్ని పునరుద్ధరించేందుకు అధునాతన డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది.

Read Also : 4G Smart Android Cluster : జియోథింగ్స్‌తో మీడియాటెక్.. టూవీలర్ల కోసం 4జీ స్మార్ట్ ఆండ్రాయిడ్ క్లస్టర్ మాడ్యూల్‌..!

అభ్యర్థుల కోసం అత్యాధునిక ఆధార్ ఆధారిత ఫింగర్ ఫ్రింట్ అథెంటికేషన్, ఫేస్ రికగ్నైజేషన్ పొందుపరచాలని కమిషన్ యోచిస్తోంది. కృత్రిమ మేధస్సు (AI) ఉపయోగించి క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ (CCTV) నిఘా, ఈ-అడ్మిట్ కార్డ్‌ల క్యూఆర్ కోడ్ స్కానింగ్ వంటి సాంకేతిక పరిష్కారాలతో పరీక్షల సమయంలో మోసాలను నిరోధించడానికి కూడా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

ఏడాదికి 14 పరీక్షల నిర్వాహణ :
యూపీఎస్సీ ప్రతి ఏడాది 14 పరీక్షలను నిర్వహిస్తుంది. ఇందులో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE), అనేక రిక్రూట్‌మెంట్ పరీక్షలు, ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు ఉంటాయి. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల సమయంలో సాంకేతిక సేవలను అందించడానికి ప్రభుత్వ రంగ సంస్థల (PNUs) నుంచి బిడ్‌లను ఆహ్వానిస్తూ టెండర్‌ను దాఖలు చేసింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో పరీక్షల ఆధారిత ప్రాజెక్ట్‌ల నుంచి కనీసం రూ. 100 కోట్ల సగటు వార్షిక టర్నోవర్‌ని కలిగిన లాభాలను ఆర్జించే సంస్థగా ఉండాలి” అని టెండర్ పేర్కొంది.

పరీక్షల నిర్వహణలో ఎన్నో లోపాలు :
పరీక్ష షెడ్యూల్, పరీక్షా వేదికల జాబితా, అభ్యర్థుల సంఖ్య పరీక్షకు రెండు మూడు వారాల ముందు ఈ సేవల ప్రదాతకి అందించడం జరుగుతుందని టెండర్ పత్రాల్లో పేర్కొన్నారు. ఇటీవల, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) 2024 నిర్వహణలో అనేక లోపాలు బయటపడ్డ తర్వాత సుప్రీంకోర్టు కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని తప్పుబట్టింది.

ఇదిలా ఉండగా, సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరయ్యేందుకు నిర్దేశించిన 12 ప్రయత్నాల కన్నా ఎక్కువగా సార్లు అయ్యేలా ఫేక్ డాక్యుమెంట్లను రూపొందించిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వివాదంతో ఈ పరిణామం జరిగింది. ఈ క్రమంలోనే యూపీఎస్సీ ఖేద్కర్‌పై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసును నమోదు చేశారు. యూపీఎస్సీ ఎంపికను రద్దు చేయడంతో పాటు భవిష్యత్ పరీక్షల నుంచి డిబార్‌మెంట్ చేసేందుకు ఆమెకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.

Read Also : Tech Titans Fight : ఎనీ ప్లేస్.. ఎనీ టైమ్.. ఎనీ రూల్స్.. మెటా బాస్‌ను రెచ్చగొడుతున్న టెస్లా బాస్..!