Thaman : అఖండ 2లో శివుడు.. బాలయ్య ఫ్యాన్స్ ని గుండెల్లో పెట్టుకుంటా.. థియేటర్స్ కి వార్నింగ్..

అఖండ సినిమాకు తమన్ ఏ రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి అదరగొట్టాడో అందరికి తెలిసిందే.(Thaman)

Thaman : అఖండ 2లో శివుడు.. బాలయ్య ఫ్యాన్స్ ని గుండెల్లో పెట్టుకుంటా.. థియేటర్స్ కి వార్నింగ్..

Thaman

Updated On : November 28, 2025 / 9:50 PM IST

Thaman : నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కాంబోలో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.(Thaman)

అఖండ సినిమాకు తమన్ ఏ రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి అదరగొట్టాడో అందరికి తెలిసిందే. కొన్ని థియేటర్స్ లో స్పీకర్స్ కూడా పగిలిపోయాయి. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమన్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసారు.

Also Read : Samyuktha : ధనుష్ కి అఖండ పిచ్చిగా నచ్చేసింది..మై డియర్ బాలయ్య.. సంయుక్త కామెంట్స్..

తమన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో శివుడి రూపంలో బాలయ్య గారిని 70 MM థియేటర్స్ లో చూసినప్పుడు మీరంతా చేతులెత్తి దండం పెడతారు. శివుడికి మ్యూజిక్ చేయాలి అంటే రుణపడి ఉండాలి. అఖండ సినిమాకే అన్ని చేసేసా. ఇంక అఖండ 2 కి ఏం చేస్తాను అనుకున్నాను. కానీ అఖండ 2 చేసిన్నన్నాళ్లు గుడికి వెళ్ళినట్టే ఉంది. జార్జియాలో చలిలో క్లైమాక్స్ ఫైట్ కోసం బాలయ్య గారు, టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. మహేష్ గారితో సినిమా చేస్తున్నప్పుడు దూకుడు అప్పుడు నాకు చాలా డ్రీమ్స్ ఉండేవి. అప్పుడు బాగా సపోర్ట్ చేసింది ఈ సినిమా నిర్మాతలే రామ్, గోపి గారు. అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువైంది అయినా సపోర్ట్ చేసారు. దూకుడు నాకు ఇచ్చినందుకు వీళ్లకు రుణపడి ఉంటాను. నాకు దూకుడు చాలా ఇచ్చింది.

ఈ సినిమాలో ఇత్తడి త్రిశూలం ఒక పది కేజీలు పైనే ఉంటుంది. అలాంటిది పట్టుకొని బాలయ్య నడుస్తూ ఉంటే ఓ రేంజ్ లో ఉంటుంది. భైరవ ద్వీపంతోనే నా కెరీర్ మొదలైంది. ఇప్పుడు ఆయనతో అయిదు సినిమాలు, మళ్ళీ గోపీచంద్ మలినేని సినిమా కూడా నేను చేస్తున్నాను. బాలయ్య గారి ఫ్యాన్స్ ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. మిమ్మల్ని గర్వపడేలా చేస్తా. ముందే చెప్తున్నా స్పీకర్స్ పగిలాయి, ఫైర్ వచ్చింది అని కంప్లైంట్ చేయొద్దు. దేవుడికి హారతి ఇచ్చినప్పుడు ఎంత హై ఉంటుందో ఈ సినిమా అంతే. ముందే థియేటర్స్ స్పీకర్స్ సర్వీస్ చేసి పెట్టుకోండి అని సరదాగా థియేటర్స్ కి వార్నింగ్ ఇచ్చారు.

Also Read : Akhanda 2 : అఖండ 2 మాస్ తాండవం టీజర్ వచ్చేసింది.. బాలయ్య బాబు ఉగ్రరూపం..