Samyuktha : ధనుష్ కి అఖండ పిచ్చిగా నచ్చేసింది..మై డియర్ బాలయ్య.. సంయుక్త కామెంట్స్..

ఈ సినిమాలో సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటించింది.(Samyuktha)

Samyuktha : ధనుష్ కి అఖండ పిచ్చిగా నచ్చేసింది..మై డియర్ బాలయ్య.. సంయుక్త కామెంట్స్..

Samyuktha

Updated On : November 28, 2025 / 9:23 PM IST

Samyuktha : నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కాంబోలో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటించింది.(Samyuktha)

Also Read : Akhanda 2 : అఖండ 2 మాస్ తాండవం టీజర్ వచ్చేసింది.. బాలయ్య బాబు ఉగ్రరూపం..

నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. నాకు శివుడు అంటే భక్తి కాదు ప్రేమ. అది చిన్నప్పటి నుంచి ఉంది. శివుడి గురించి ఏదైనా సరే చేయాలి అనుకున్నాను. శివుడు నాలో ఒక భాగం. అందుకే ఈ సినిమాలో భాగం అయ్యాను. నేను సర్ సినిమా షూటింగ్ చేసేటప్పుడు ధనుష్ గారు అఖండ సినిమా చూసి ఓ రేంజ్ లో పొగిడారు. థమన్ అయితే అదరగొట్టాడు అని చెప్పారు. ఆయనకు అఖండ బాగా నచ్చేసింది. అప్పట్నుంచి నాకు ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది.

నేను కుంభమేళాకు వెళ్దాం అనుకున్న సమయంలోనే పార్ట్ 2 లో అవకాశం వచ్చింది. చిన్న పాత్ర అని చెప్పారు. అయినా నేను ఓకే చెప్పేసాను ఈ సినిమా చేద్దామని ఎదురుచూస్తున్నాను కాబట్టి. బోయపాటి గారు యాక్షన్ ఫుల్ ఎనర్జి ఉంటుంది. మై డియర్ బాలయ్య గారు అసలు మీతో బ్యాడ్ డే ఉండదు. అసలు మీరు అన్ని ఎలా చేయగలుగుతారు. ఓ పక్క సినిమా, మరో పక్క హిందూపురం గురించి, మరో వైపు క్యాన్సర్ హాస్పిటల్ గురించి మాట్లాడతారు చేస్తారు అంత ఎనర్జీ ఎక్కడిది. నాకు కూడా అంత ఎనర్జీ లేదు. ఎప్పుడైనా సరే రెడీ అని అంటారు షూట్ కి. మేము ఏ సీన్ చేసినా షూటింగ్ సమయంలోనే తమన్ ఈ సీన్ ని లేపుతారు అని అనుకుంటాము. నేను ఫస్ట్ టైం ఈ సినిమాలో ఒక కమర్షియల్ సాంగ్ చేశాను. బాలయ్య గారి లాంటి కో యాక్టర్ ఉండాలి, మనం టెన్షన్ లో ఉంటే సపోర్ట్ చేసేలా అని తెలిపారు.

Also Read : Revolver Rita Review : ‘రివాల్వర్ రీటా’ మూవీ రివ్యూ.. డాన్ వచ్చి హీరోయిన్ ఇంట్లో చనిపోతే ఏం జరిగింది..?