తెలంగాణ టెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ షురూ

పరీక్ష వివరాలతో పాటు సిలబస్‌కు సంబంధించిన అంశాలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉంచారు.

తెలంగాణ టెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ షురూ

Telangana TET

Updated On : November 15, 2025 / 10:41 AM IST

Telangana TET: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) కోసం నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు నవంబర్ 29 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 వరకు టెట్ నిర్వహిస్తారు.

స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ రెండు రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష వివరాలతో పాటు సిలబస్‌కు సంబంధించిన అంశాలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉంచారు. హాల్‌టికెట్లు డిసెంబర్‌ 27న విడుదలవుతాయి.

జమ్మూకశ్మీర్‌లో భారీ పేలుడు.. 9 మంది మృతి, మరో 29 మందికి గాయాలు

పరీక్షలకు రోజుకు రెండు సెక్షన్లుగా నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు ఉంటాయి. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్‌ అర్హత జీవితకాలం పాటు ఉంటుంది. ఈ పరీక్షలో జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది,

అలాగే, బీసీలు 50, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులు సాధిస్తే అర్హత పొందినట్లు. పేపర్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇప్పటికే సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు కూడా టెట్‌ రాయవచ్చు.

ప్రస్తుత ఏడాదికి సంబంధించి తొలి దశ నోటిఫికేషన్‌ను జూన్‌లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. జులై 22న ఫలితాలు వచ్చాయి.