Spinach For Health : బచ్చలి కూర ఆరోగ్యానికి ఎంతగా మేలు కలిగిస్తుందంటే ?

బచ్చలి ఇనుము లోపం అనీమియా ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చలి శాఖాహారం. బలహీనంగా, తల తిరగడం , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిన వారు బచ్చలి కూర తినటం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు.

spinach for health

Spinach For Health : పచ్చి ఆకు కూరలలో బచ్చలి కూర ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. కేలరీలు తక్కువగా ఉండే ఆహారం శరీరానికి అనేక విధాలుగా మేలు చేసే పోషకాలతో నిండి ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థను పెంచడం మొదలు సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా శరీరానికి రక్షణ నిలవటం, గుండెకు సహాయం చేయడం వరకు, దాని ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

READ ALSO : Dairy Management : గేదెల డెయిరీ నిర్వాహణలో రిటైర్డ్ ఇంజనీర్.. పాలను డోర్ డెలివరీ చేస్తూ లాభాలు

బచ్చలిలోని నీరు, ఇతర పానీయాలు హైడ్రేట్ గా ఉంచటానికి సహాయపడుతుంది. అదనపు H2O కోసం బచ్చలి కూరను భోజనం, స్నాక్స్‌లో కలిపి తీసుకోవచ్చు. బచ్చలికూరలో అధిక మోతాదులో కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, ఇనుము,విటమిన్ ఎ, విటమిన్ సి,బీటాకెరాటిన్ విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఆకలిని అరికడుతుంది. బచ్చలికూర వంటి మొక్కలలోని థైలాకోయిడ్ పదార్దాలు ఆకలిని తగ్గించటంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది ఆకలి హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది. కడుపు నిండిన అనుభూతిని కలిగించే హార్మోన్లను పెంచుతుంది.

బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. బచ్చలికూరలో కాల్షియం, మాంగనీస్ మరియు విటమిన్ కె ఉన్నాయి, ఇవి ఆరోగ్యకరమైన ఎముకలకు సహాయపడతాయి. శరీరం నిత్యం ఎముక కణజాలాన్ని తొలగిస్తుంది, తిరిగి పునర్నిర్మిస్తుంది. బోలు ఎముకల వ్యాధి, ఎముకలు బలహీనపడటాన్ని, విరిగిపోవటాన్ని నిరోదిస్తుంది.

READ ALSO : Integrated Farming : పండ్లు, శ్రీగంధం, చేపల పెంపకంతో సమీకృత వ్యవసాయం

బచ్చలి ఇనుము లోపం అనీమియా ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చలి శాఖాహారం. బలహీనంగా, తల తిరగడం , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిన వారు బచ్చలి కూర తినటం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. బచ్చలికూర రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇచ్చే విటమిన్ E మరియు మెగ్నీషియం వంటి విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థ వ్యాధిని కలిగించే వైరస్‌లు మరియు బ్యాక్టీరియా నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఇది టాక్సిన్స్ వంటి హాని కలిగించే వాటినుండి శరీరాన్ని రక్షిస్తుంది.

శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి, మంచి కొవ్వును పెంచుతుంది. ఊపిరి తిత్తులకు బచ్చలి ఎంతో మేలు చేస్తుంది. వృద్దాప్య ప్రక్రియను తగ్గిస్తుంది. దీనిలో సెలీనియం, నియాసిన్ , ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండటం వల్ల మెదడు, నరాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మల మద్దకపు నివారణలో, క్యాన్సర్ రాకుండా చూడటంలో సహాయకారిగా పనిచేస్తుంది. చర్మం మృదువుగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

READ ALSO : Rabi Corps : రబీలో వేయదగిన పంటలు.. శాస్త్ర వేత్తల సూచనలు

పాలకూరలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ శిశువులలో పుట్టుక సమయంలో కలిగే లోపాలను నివారిస్తుంది. అందుకే గర్భవతి అయితే ఫోలిక్ యాసిడ్ తో కూడిన సప్లిమెంట్ తీసుకోమని వైద్యులు సూచిస్తుంటారు. బచ్చలికూర తీసుకోవటం వల్ల విటమిన్ B6 పొందవచ్చు. శిశువు మెదడు అభివృద్ధి చెందడానికి బచ్చలి కీలకంగా ఉపయోగపడుతుంది.

గమనిక: అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో ఈ సమాచారం అందించమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు , సలహాలు తీసుకోవటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు