Stay Cool At Home : వేసవిలో ఏసీ లేకుండా ఇంట్లో కూల్‌గా ఉండటం ఎలాగంటే?

వాటర్ మిస్ట్‌లను ఉపయోగించడం ద్వారా ఏసీ లేకుండా గదిని చల్లబరచవచ్చు. నీటిని పొగమంచులా గది మొత్తం విస్తరింప చేయటం అన్నది శీతలీకరణ సాంకేతికతకు ఒక వరంగా చెప్పవచ్చు. గదిలోని వేడిని గ్రహించి వెంటనే ఆవిరైపోతాయి. ఇది రెండు విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.

Stay Cool At Home : వేసవి ఎండలు మండుతున్నాయి. వేసవి తాపం నుండి తప్పించుకునేందుకు చాలా మంది ఎయిర్ కండీషనర్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఇలా వేసవి వేడి నుండి రక్షించుకునేందుకు ఇంటి లోపల ఎయిర్ కండీషనర్లలో గడపటం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎయిర్ కండీషనర్ల నుండి వెలువడే గాలిలో వైరస్ లు వ్యాపిస్తాయి. వీటిని పీల్చటం వల్ల నిర్జలీకరణం, అలసటతోపాటు, నెలవారీ విద్యుత్ బిల్లుకూడా తడిసిమోపెడవుతుంది. గది వాతావరణాన్ని ఎయిర్ కండీషనర్లు లేకుండా చల్లబరిచేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిని ప్రయత్నించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

READ ALSO : Beer : వేసవిలో చల్లదనం కోసం బీరు తాగటం మంచిదా?

ఎయిర్ కండీషనర్ ప్రత్యామ్నాయాలు ;

1. వేసవిలో గదిలో ఏసీ లేకుండా ఫ్యాన్లతోనే గదిని చల్లబరచవచ్చు. గదిని చల్లబరచడంలో మరింత ప్రభావవంతంగా ఫ్యాన్‌ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాలి. సీలింగ్ ఫ్యాన్ బ్లేడ్‌లను యాంటీక్లాక్‌వైస్‌లో తిరిగేలా కాన్ఫిగర్ చేయాలి, తద్వారా వేడి గాలి గది చుట్టూ ప్రసరించేలా కాకుండా గది నుండి బయటకు వస్తుంది. చల్లని గాలిని లోపలకు తరలించడానికి, వేడి గాలిని బయటకు నెట్టడానికి ఉత్తమ సాంకేతికత క్రాస్‌విండ్‌ను సృష్టించటం వల్ల ఫలితం ఉంటుంది. ఇది వేడి గాలిని బయటికి నెట్టడంలో, చల్లటి గాలిని లోపలికి తీసుకురావడంలో సహాయపడుతుంది.

ఫ్యాన్ ముందు ఐస్ బేసిన్ ఉంచడం లేదా వెనుక నుండి తడిగా ఉన్న గుడ్డను వేలాడదీయడం ద్వారా దాని శీతలీకరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచవచ్చు.  థర్మల్ ఒత్తిడిని తగ్గించడానికి ఫ్యాన్ సమర్థవంతమైనదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది చెమటను పూర్తిగా పీల్చుకోకపోవచ్చు అయితే ఎయిర్ కండిషనింగ్‌తో పోలిస్తే, ఫ్యాన్ విద్యుత్‌ను ఆదా చేస్తుంది. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించగలవు.

READ ALSO : Summer : వేసవిలో ద్రవాహారానికే పరిమితమౌతున్నారా? అయితే జాగ్రత్త

2. చెమట ద్వారా కోల్పోయిన నీరు మరియు అవసరమైన ఖనిజాలను తిరిగి శరీరంలో నింపటానికి నీరు అధిక మోతాదులో తీసుకోవాలి. నిర్జలీకరణాన్ని నివారించడానికి మీ ఆహారంలో అధిక నీటి కంటెంట్ తోపాటు, కూరగాయలను చేర్చుకోవాలి. నీరు త్రాగడం ఇబ్బందిగా ఉంటే, ఇంట్లో మజ్జిగ, పచ్చి మామిడి రసం, చక్కెరలు లేకుండా షేక్స్‌ని తీసుకోండి. ప్రయాణ సమయాల్లో హైడ్రేట్ ఉండాలంటే కొబ్బరి నీరు తీసుకోవటం మంచిది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

3. కారంగా ఉండే వేయించిన ఆహారాన్ని తినటం నివారించాలి. కడుపులో తేలికగా ఉండే కొద్దిపాటి నూనెతో తాజాగా ఇంట్లో తయారుచేసిన వంటకాలను తీసుకోండి. తాజాగా కోసిన దోసకాయ, ఉల్లిపాయలు , టొమాటోలతో తయారు చేయబడిన సలాడ్లు, దహీ వడ వంటి పెరుగు ఆధారిత సావరీస్, పొట్లకాయలతో చేసిన కూరలు, పుచ్చకాయ వంటివి అధిక నీటి కంటెంట్ కలిగి ఉంటాయి.

4. వాటర్ మిస్ట్‌లను ఉపయోగించడం ద్వారా ఏసీ లేకుండా గదిని చల్లబరచవచ్చు. నీటిని పొగమంచులా గది మొత్తం విస్తరింప చేయటం అన్నది శీతలీకరణ సాంకేతికతకు ఒక వరంగా చెప్పవచ్చు. గదిలోని వేడిని గ్రహించి వెంటనే ఆవిరైపోతాయి. ఇది రెండు విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. గది చల్లబరుస్తుంది. తేమ స్థాయిలు ఉండేలా చూసుకోవచ్చు.

READ ALSO : Watermelon : వేసవిలో శరీరాన్ని చల్లగా,ఆరోగ్యంగా ఉంచే పుచ్చకాయ !

5. వేసవిలో శాటిన్, సిల్క్ మరియు పాలిస్టర్ దుస్తులకు దూరంగా ఉండండి. నిద్రించేందుకు ఉపయోగించే బెడ్ లను దూదితో తయారైన వాటిని వినియోగించండి. ఇది చెమటను తగినంతగా గ్రహిస్తుంది. చల్లదనాన్ని అందించడంలో సహాయపడుతుంది.

6. మార్కెట్లో దొరికే వట్టివేళ్ళతో కూడిన తెరచాపలను ఇంటి చుట్టూ కిటికీలు, ద్వారాలకు వేలాడదీయండి. వాటిని నీటితో తడుపుతూ ఉండటం వల్ల ఇంట్లో వాతావరణాన్ని చల్లబరుచుకోవచ్చు. ఇలా చేయటం వల్ల వేసవి కాలంలో ఏసీతో పెద్దగా పని ఉండదు.

READ ALSO : Summer Safety For Children : వేసవి కాలంలో మీ పిల్లలు జాగ్రత్త !

ఇల్లు మరియు జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా ఏసీ లేకుండా గదిని చల్లబరుచుకోవచ్చు. అత్యంత వేడిగా ఉండే వేసవికాలంలో కూడా మీరు సౌకర్యవంతమైన ఇంటి వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. ఇలా చేయటం వల్ల డబ్బు ఆదా చేయడమే కాకుండా భూమిపై కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు. కాబట్టి వేసవి అంతా చల్లగా ఉండాలంటే ఈ సూచనలను పాటించటం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు