Joint Pains : ఈ లడ్డు రోజుకు ఒకటి తింటే చాలు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు మాయం !

రోగనిరోధక శక్తిని పెంచడంలో ఖర్జూరం మేలు చేస్తుంది. హార్మోన్ల నియంత్రణను నిర్వహించడంలో, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తోడ్పడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఖర్జూరం మేలు చేస్తుంది. ఖర్జూరంలో ఫాస్ఫ‌ర‌స్‌, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియంలు ఎముక‌లను దృఢంగా మారుస్తాయి.

Joint Pains

Joint Pains : అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి వాటిలో ఖర్జూరం, నువ్వులు రెండూ చాలా కీలకమైన పోషక ఆహారాలు. నువ్వులు శరీరానికి కావలసిన పోషకాలు అందిస్తాయి. వీటిలో ఐరన్‌ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గుతుంది. నీరసంగా, బలహీనంగా ఉండేవారు నువ్వుల లడ్డూలను తినటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

READ ALSO : Kidney Stones : చక్కెర పదార్ధాలతో కిడ్నీలో రాళ్ల ముప్పు !

నువ్వుల్లో ఉండే అమైనోయాసిడ్‌, మాంసకృతులు, మెగ్నీషియం వల్ల అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది. రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. పాంక్రియాస్‌ సక్రమంగా పనిచేస్తుంది. ఉబ్బసం నియంత్రణకు, రక్తనాళాలు, ఎముకలు, కీళ్ళు సక్రమంగా పని చేసేందుకు నువ్వులు తోడ్పడతాయి. నువ్వుల్లోని ఔషధ గుణాలు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను నివారిస్తాయి. నువ్వుల్లోని పోషకాలు కార్డియో వాస్క్యులర్‌ సమస్యను నిరోధిస్తాయి.

READ ALSO : Viral News : పూడ్చిన శవపేటిక నుంచి శబ్దాలు, తెరిచి చూస్తే శవం నిండా గాయాలు..

అలాగే ఖర్జూరం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరతాయి. వీటిని తీసుకోవటం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఖర్జూరం మేలు చేస్తుంది. హార్మోన్ల నియంత్రణను నిర్వహించడంలో, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తోడ్పడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఖర్జూరం మేలు చేస్తుంది. ఖర్జూరంలో ఫాస్ఫ‌ర‌స్‌, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియంలు ఎముక‌లను దృఢంగా మారుస్తాయి. నిత్యం ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగుపడి అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం తొలగిపోతాయి. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

READ ALSO : Sheep Farming : వర్షాకాలంలో జీవాలకు వ్యాధులు.. నివారణకు ముందస్తు జాగ్రత్తలు

ముఖ్యంగా ఎముకలు, దంతాలు ధృడంగా ఉండాలన్నా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గాలన్నా , క్యాల్షియం లోపంతో బాధపడే వారు ఖర్జూరం, నువ్వులు కలిపి తయారు చేసిన లడ్డూలను తినడం వల్ల క్యాల్షియం లోపం తగ్గి నొప్పులన్నీ తొలగిపోతాయి. వీటి వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు దరిచేరవు. జుట్టు, చర్మ ఆరోగ్యానికి ఈ లడ్డూలు మేలు చేస్తాయి.

READ ALSO : Fish Farming : మంచినీటి చెరువుల్లో పెంచే చేప రకాలు

ఖర్జూరం, నువ్వుల లడ్డూల తయారీ ;

ఒక కళాయిలో ఒక కప్పు నువ్వులను వేసి దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒకటిన్నర కప్పు ఖర్జూర పండ్లను తీసుకుని వాటిలో ఉండే గింజలను తొలగించి చిన్నచిన్న ముక్కలుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి. ఈ ఖర్జూర పండ్ల గుజ్జును నువ్వులల్లో వేసి బాగా కలుపుకుని లడ్డూలుగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లడ్డూలను రోజుకు ఒకటి చొప్పున తీసుకోవాలి. వీటిని తినటం వల్ల శరీరానికి అవసరమైన క్యాల్షియం లభించడంతో పాటు ఇతర ఆరోగ్యసమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు